Saturday, November 23, 2024
HomeతెలంగాణJanagama: 12 రకాల ఫొటో ఐడీలతో ఓటేయచ్చు

Janagama: 12 రకాల ఫొటో ఐడీలతో ఓటేయచ్చు

తప్పనిసరిగా ఓటేయాల్సిందే

జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో నేడు జరగనున్న ఎన్నికల ప్రక్రియలో ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు) లేకున్నా ఇతర 12 రకాల ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానిని చూపించి తమ ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు.

- Advertisement -

ఎపిక్ కార్డు లేని వారు ఆధార్ కార్డు, జాతీయ ఉపాధి హామీ జాబ్ కార్డు, బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ వారిచే జారీ చేసిన పాస్ పుస్తకాలు, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య భీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఎన్పీఆర్ కింద ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డు, పాస్ పోర్టు, ఫొటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పీఎస్ యూలు, పబ్లిక్ లిమిటెడ్ సంస్థల ఉద్యోగులకు ఫొటోతో జారీ చేసిన ఐడీ కార్డు, ప్రత్యేక వైకల్యం ఐడీ కార్డు (యూడీఐడీ) లలో ఏదో ఒకదానితో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

ఎన్నికలలో అర్హులైన ప్రతి ఓటరూ తమ ఓటును తప్పనిసరిగా వేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News