Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Polling starts: ప్రారంభమైన పోలింగ్

Polling starts: ప్రారంభమైన పోలింగ్

ఓటర్లూ తప్పనిసరిగా ఓటేయండి

ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు పార్లమెంటుకు ఎన్నికలు జరుగనున్నాయి. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటరీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది.

- Advertisement -

ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 25 పార్లమెంటరీ స్థానాలకు 454 మంది, 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.

రాష్ట్రంలో జరుగతున్న ఎన్నికల్లో మొత్తం 4,14,01,887 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, వీరిలో 2,03,39,851 మంది పురుషులు, 2,10,58,615 మంది మహిళలు మరియు 3,421 మంది ట్రాన్స్ జండర్స్ ఉన్నారు. వీరంతా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

వీటిలో సమస్యాత్మకంగా గుర్తించిన 12,438 పోలింగ్ కేంద్రాల్లో మరింత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. మొత్తం పోలింగ్ కేంద్రాల్లో 31,385 పోలింగ్ కేంద్రాలను అంటే 75 శాతం పోలింగ్ కేంద్రాలను పూర్తి స్థాయిలో లోపలా, బయట కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిరంతరాయంగా పర్యవేక్షించేందుకు అన్ని ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ చేసింది.

రాష్ట్రంలో జరిగిన గత ఎన్నికల్లో 79.84 శాతం ఓటింగ్ నమోదు కాగా, ఈ ఎన్నికల్లో 83 శాతం ఓటింగ్ లక్ష్యంగా విస్తృత స్థాయిలో ఓటర్లను చైతన్య పర్చే విధంగా పలు స్వీప్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఈసీ చేపట్టింది.

రాష్ట్రంలో 46,389 పోలింగ్ కేంద్రాలలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 1.60 లక్షల కొత్త ఈవీఎమ్ లను వినియోగిస్తున్నారు. వీటికి అదనంగా మరో 20 శాతం కొత్త ఈవీఎమ్ లనుకూడా సిద్దంగా ఉంచారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News