Friday, September 20, 2024
HomeతెలంగాణNirmal: ఓటింగ్ ట్రెండ్ పరిశీలించిన కలెక్టర్ అశీష్ సంగ్వాన్

Nirmal: ఓటింగ్ ట్రెండ్ పరిశీలించిన కలెక్టర్ అశీష్ సంగ్వాన్

అందరూ ఓటేయండి

కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లాలోని పోలింగ్ సరళిని పరిశీలించారు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. నిర్మల్ పట్టణంలోని జెడ్పీ కార్యాలయంలోని 237 వ నంబర్ పోలింగ్ కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కలెక్టర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటర్లంతా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలన్నారు. ఓటింగ్ శాతం పెరిగిందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పోలింగ్ కేంద్రంలో గల ఏర్పాట్లను పరిశీలించారు.

- Advertisement -

ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు అనేది ప్రజలందరికీ రాజ్యాంగం కల్పించిన గొప్ప వరం అని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.

ఉదయం 11 గంటల వరకు నిర్మల్ జిల్లాలో నమోదైన ఓటింగ్ శాతం వివరాలు :

ఖానాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఓటింగ్ శాతం – 30.33 %
నిర్మల్ అసెంబ్లీ సెగ్మెంట్ ఓటింగ్ శాతం – 30.09 %
ముదోల్ అసెంబ్లీ సెగ్మెంట్ ఓటింగ్ శాతం – 31.60 %

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News