Saturday, November 23, 2024
Homeచిత్ర ప్రభJayasudha: మూడో పెళ్లి చేసుకున్న జయసుధ?

Jayasudha: మూడో పెళ్లి చేసుకున్న జయసుధ?

తెలుగువారికి అత్యంత ఇష్టమైన ‘సహజనటి’ జయసుధ మూడవ పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇంకా దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ ఫోటోలు చూస్తుంటే మాత్రం ఇది నిజమనేలా ఉంది.

- Advertisement -

60 ఏళ్ల వయసులో ఉన్న ఈ వెటరన్ హీరోయిన్ గత కొంత కాలంగా ఓ విదేశీయుడితో సహజీవనం చేస్తున్నట్టు తెలుస్తోంది. పైగా ఎక్కువకాలం ఆమె విదేశాల్లోనే ఉంటున్నారు కూడా. ఈమధ్యనే వారసుడు సినిమాలో హీరో విజయ్ కు తల్లిగానూ ఆమె నటించారు. సినిమాలు తగ్గించుకుని ఈయనతోనే క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నట్టు ఫిలిం నగర్లో గట్టిగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

2017లో భర్త నితిన్ కపూర్ మానసిక అనారోగ్యంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఈమధ్యనే తన పెళ్లిపై వచ్చిన వార్తలను ఖండించిన జయసుధ ఆ విదేశీయుడు ఆమెపై బయోపిక్ తీస్తున్నాడని క్లారిటీ ఇచ్చారు.

మొదట వడ్డే రమేష్ ను వివాహం చేసుకున్న ఆమె ఆతరువాత విడాకులు తీసుకున్నారు. ఆతరువాత బాలీవుడ్ హీరో జితేంద్ర కజిన్ నితిన్ కపూర్ ను పెళ్లి చేసుకున్నారు 1985లో. ఆమెకు ఇద్దరు కుమారులు నిహార్, శ్రీయాన్ ఉన్నారు. వీరిలో ఒకరిని ఆమె హీరోగా లాంచ్ చేసినా ప్రయోజనం లేకపోయింది. ఆతరువాత రాజకీయాల్లోనూ ఆమె తన కుమారుడితో కలిసి సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టినా అది ట్రాక్ లో పడలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆమె బిజీగా ఉన్నారు.

12 ఏళ్లకే సినిమాల్లో నటించటం మొదలుపెట్టిన జయసుధ పండంటి కాపుర్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. 1972లో వచ్చిన పండంటి కాపురంలో ఆమె కమల్ హాసన్ తో కలిసి యాక్ట్ చేశారు. లక్ష్మణ రేఖతో ఆమె తెలుగు సినిమా కెరీర్ మొదలైంది. జ్యోతి సినిమా ఆమె జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News