రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో వృద్ధులు సైతం తమ ఓటు హక్కును వేసేందుకు పోలింగ్ బూత్‌లకు వచ్చారు మండలంలోని ఎం అగ్రహారం గ్రామానికి చెందిన ఉటుకురు సరోజమ్మ, 94 ఏళ్ల వయసులో కుటుంబ సభ్యుల సహకారంతో గ్రామంలోని పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు ఓటు హక్కు వచ్చిన నాటి నుండి ప్రతి ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఓటు వేశానని, ఈ ఎన్నికలలో వయసు పైబడినా ఓటు వినియోగించుకోవడం చాలా సంతోషకరమన్నారు. కుటుంబ సభ్యుల సహకారంతో పోలింగ్ బూత్ కు చేరుకున్నానని ఆమె వివరించారు. ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలని అప్పుడే మనకు విలువ పెరుగుతుందన్నారు. ఈ వయసులో ఓటు వేసేందుకు వచ్చిన ఆమెను పలువురు అభినందించారు.
Maddikera: 94 ఏళ్ల వయసులో పోలింగ్ బూత్ కు
ఓటేసిన సీనియర్ సిటిజెన్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES