Saturday, November 23, 2024
HomeతెలంగాణWarangal: 50 వేల మెజార్టీతో గెలుస్తున్నా

Warangal: 50 వేల మెజార్టీతో గెలుస్తున్నా

బిజెపి ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్

తాను 50 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నట్టు బీజేపీ అభ్యర్థి అరూరి రమేష్ అన్నారు. అమెరికా, హైదరాబాద్, బెంగుళూరు నుండి కూడా వచ్చి నాకు ఓటేశారు అని రమేష్ తెలిపారు. ప్రజలను ప్రలోభ పెట్టినా కూడా వాళ్ళు నావైపు ఉన్నారు అని అన్నారు. నన్ను చూస్తే కాంగ్రెస్ వాల్ల వెన్నులో వణుకు పుడుతుంది అని అన్నారు. పోలింగ్ జరుగుతున్న కూడా ఓట్ ఫర్ కాంగ్రెస్ అని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు అని అన్నారు. బీజేపీకి పూర్వ వైభవం రావాలని కసితో మా క్యాడర్ పని చేసారు అని తెలిపారు. సైలెంట్ ఓటింగ్ నాకే మొగ్గు చూపుతుంది అని అన్నారు.

- Advertisement -

హనుమకొండ, హంటర్ రోడ్ లోని వేద ఫంక్షన్ హాల్ లో బిజెపి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి అరూరి రమేష్, వరంగల్ – నల్లగొండ -ఖమ్మం గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమెంధర్ రెడ్డిల పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు.
సమావేశంలో బిజెపి వరంగల్ పార్లమెంట్ ప్రభారి డా.వి.మురళీధర్ గౌడ్, హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ రెడ్డి, క్లస్టర్ ఇంఛార్జి మార్తినేనీ ధర్మారావు, మాజీ ఎమ్మెల్యే వన్నల శ్రీరాములు, ఎస్సి మోర్చ రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్, రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి అరూరి రమేష్ మాట్లాడుతూ.. మోడీని బలపర్చడానికి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

ఉమ్మడి నల్గొండ – వరంగల్ – ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమేంధర్ రెడ్డి మాట్లాడుతూ..వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని బిజెపి భారీ మెజారితో గెలువబోతుంది అని అన్నారు.
పోలింగ్ జరుగుతుంటే నిబంధనలు ఉల్లంఘించి సీఎం రేవంత్ ప్రెస్ మీట్ పెట్టారు అని అన్నారు.
కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. వాళ్ళ ఓటమిని సీఎం అంగీకరించారు అని అన్నారు. ఎమ్మెల్సీగా నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.సేవ చేసుకునే అవకాశం నాకు ఇవ్వండి అని, పార్టీలు మార్చే వ్యక్తిని కాదు అని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News