Thursday, April 10, 2025
Homeనేషనల్Chennai: హీరో అర్జున్ నిర్మించిన హనుమాన్ దేవాలయంలో కవిత

Chennai: హీరో అర్జున్ నిర్మించిన హనుమాన్ దేవాలయంలో కవిత

సినీ హీరో అర్జున్ సర్జ నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా అర్జున్ దంపతులు కల్వకుంట్ల కవితకు ఘనస్వాగతం పలికారు. చెన్నైలో పర్యటించడం తనకు ఎప్పుడూ ఆనందంగా ఉంటుందన్న కవిత..తమిళనాడు అస్తిత్వం చాలా గొప్పదని, అక్కడి ప్రజలు స్ఫూర్తిదాయకంగా ఉంటారని అన్నారు. తమిళనాడు ప్రజలు తమ సంస్కృతి భాష చరిత్ర వారసత్వం పట్ల గర్వంగా ఉంటారని, ప్రతి ఒక్కరికి ఆ గౌరవభావం ఉండాలని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆలోచన తత్వం భారతీయులను ఐక్యంగా ఉంచుతుండడం గర్వంగా ఉందని తెలిపారు కవిత. దేశంలోని అతిపెద్ద హనుమాన్ దేవాలయాన్ని నిర్మించినందుకు అర్జున్ కు కవిత అభినందనలు తెలిపారు. ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహించనున్న సదస్సులో పాల్గొనడానికి చెన్నైలో పర్యటిస్తున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News