Friday, April 11, 2025
Homeనేరాలు-ఘోరాలుTanduru: 5 నెలల శిశువుపై పెంపుడు కుక్క దాడి

Tanduru: 5 నెలల శిశువుపై పెంపుడు కుక్క దాడి

రక్తపు మడుగులో బాలుడు మృతి

వికారాబాద్‌ జిల్లా తాండూరులో 5 నెలల శిశువుపై ఓ పెంపుడు కుక్క దాడి సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్ జిల్లాకు చెందిన దత్తు, లావణ్య దంపతులు తాండూరు మండలం గౌతాపూర్ గ్రామ పంచాయతి పరిధి బసవేశ్వర నగర్ ఓ పాలిషింగ్‌ యూనిట్లో పనిచేస్తున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం వీరికి వివాహము జరిగింది. గత 5 నెలల క్రితం బాలుడు(సాయి నాథ్‌) జన్మించాడు. ఉదయం దత్తు యూనిట్లో పనిచేస్తుండగా, భార్య వస్తువులు కొనేందుకు ఇంటి బయటకు వచ్చింది. ఇంతలో పాలిషింగ్‌ యూనిట్ యజమానికి చెందిన పెంపుడు కుక్క ఇంట్లోకి వెళ్లి బాలుడుపై దాడి చేసి కరిచేసింది. అప్పటికే కేకలు విన్న కుటుంభీకులు వచ్చి చూసే సరికి బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతికి కారణమైన కుక్కను ఆవేశంతో కుటుంభ సభ్యులు దాడి చేసి చంపేశారు.
ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న కరణ్‌ కోట్‌ ఎస్ఐ విఠల్‌ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News