గ్రామాల్లో డెంగ్యూ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మెడికల్ ఆఫీసర్ పృథ్వి అన్నారు. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు గార్ల మండల పరిధిలోని ముల్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
అనంతరం మెడికల్ ఆఫీసర్ పృథ్వీ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య సిబ్బందికి డెంగ్యూ వ్యాధి నిర్మూలనపై పలు సూచనలు చేశారు. డెంగ్యూ నివారణకు తీసుకోవాల్సిన అంశాలను వివరించారు. లార్వా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గ్రామ పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా మురికి గుంటలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
పగటిపూట కుట్టే దోమల వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుందని, తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదన్నారు. ప్రతి శుక్రవారం తప్పనిసరిగా డ్రై డే ఫ్రైడే పాటించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పిడిఎమ్ఓ డాక్టర్ నవీన్ కుమార్ సి హెచ్ ఓ సక్కుబాయి సూపర్వైజర్లు ఇస్మాయిల్ బేగ్ రాధాకృష్ణ బుజ్జమ్మ పద్మ ఎమ్ ఎల్ హెచ్ పి ఎస్ ఏ ఎన్ ఎం లు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.