రెండు లక్షల విలువ గల రోబోటిక్ లెగ్ (కృత్రిమ కాలు) ను వికలాంగుడు వేపచేదుల సైదులుకు పట్టణంలోని పోరెడ్డి స్వరాజ్యలక్ష్మి ఆమె భర్త పోరెడ్డి సత్యనారాయణ రెడ్డి జ్ఞాపకార్థం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో అందజేశారు.
- Advertisement -
ఈ సందర్భంగా లబ్ధిదారుడు సైదులు మాట్లాడుతూ ఇటీవల అనారోగ్య కారణాలతో తన కాలు తీసివేసినట్లు తెలిపారు కృత్రిమ కాలు అందజేసిన స్వరాజ్యలక్ష్మికి కృతజ్ఞతలు తెలియజేశారు. కృత్రిమ కాలు వల్ల మునపటిలా అన్ని పనులు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకోవచ్చని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ యూత్ కాంగ్రెస్ నాయకులు ఇంజమూరి శ్రీకాంత్, ఇంజమూరి పున్నయ్య, గోపి తదితరులు పాల్గొన్నారు.