Saturday, November 23, 2024
HomeతెలంగాణTeluguprabha effect-Thorruru: తెలుగుప్రభ కథనానికి స్పందించిన ఇరిగేషన్ అధికారులు

Teluguprabha effect-Thorruru: తెలుగుప్రభ కథనానికి స్పందించిన ఇరిగేషన్ అధికారులు

ఐదేళ్లుగా పెండింగ్ లో..

మిని ట్యాంక్ కల నేరవేరేనా అనే కథనాన్ని గురువారం తెలుగుప్రభ పత్రికలో ప్రచురితమైన కథనానికి శుక్రవారం ఇరిగేషన్ అధికారులు స్పందించారు. ఈనేపథ్యంలో తొర్రూర్ పట్టణ కేంద్రంలోని మిని ట్యాంక్ బండ్ నిర్మాణం జరిగే ప్రదేశం పెద్ద చెరువును పరిశీలించారు.2018-19సంవత్సరంలో 3.60కోట్ల వ్యయంతో సుందరీకణ పనుల కోసం అప్పటి రాష్ట్రప్రభుత్వం మంజూరు చేసింది. ఇదంతా బాగానే ఉన్నప్పటికి పనులు మొదలు పెట్టి ఐదు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటి వరకు పనులు పూర్తి కాకపోవడం గమనార్హం.. ఇందులో ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. గత ఏడాది చెరువు కట్ట తెగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో స్పందించిన అధికారులు వారం రోజుల్లో పనులు మొదలు పేడుతామని చెప్పారు.

- Advertisement -

కాంట్రాక్టర్ పై చర్యలకు వెనుకడుగు వేస్తున్న ఇరిగేషన్ శాఖ:

తొర్రూర్ పట్టణంలోని చెరువులో బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయితేనే సుందరీకరణ పనులు మొదలు పెడుతామని అధికారులు చెబుతున్నారు. దీంతో కాంట్రాక్టర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి ఫిల్లర్లను పోసి గాలికి వదిలేశాడు. పనులు మొదలు పెట్టి సంవత్సరాలు గడుస్తున్న సదరు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. చెరువు కట్ట ప్రమాదంను పొంచి ఉన్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం గమనార్హం.

చెరువు ప్రమాదంలో ఉన్న నత్తనడకన పనులు:

గత సంవత్సరం చెరువు కొట్టుకు గండిపడి రైతులు తీవ్రంగా నష్టపొయ్యారు. ప్రమాదం పొంచి ఉందని తెలిసినప్పటికీ ఈ ఏడాది పనులు మొదలు పెట్టకపోవడంతో ఆయకట్టు సగానికి చీలిపోయింది. దీంతో వర్షాకాలంలో మళ్ళీ చెరువు కట్ట తెగిపోయి ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. గతంలో తెగిన చెరువు కట్టకు ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేశారు. ఇప్పటికైనా పనులు మొదలు పెట్టకపోతే రైతులు తీవ్రంగా నష్టపోక తప్పదు. అధికార యంత్రాంగం పనులపై దృష్టి సారించకపోతే 600 ఎకరాలకు పంట నష్టం కలిగే ప్రమాదం ఉంది. ఇదంతా సంబంధిత అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం గమనార్హం.

బ్రిడ్జి నిర్మాణం పూర్తయితేనే సుందరీకరణ పనులు మొదలు:

బ్రిడ్జి నిర్మాణం పూర్తయితేనే సుందరీకరణ పనులు మొదలు పెడుతామని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సంబంధిత కాంట్రాక్టర్ బ్రిడ్జి నిర్మాణం కోసం 5 పిల్లర్లను పోసి వదిలేశాడు. ఈ నేపథ్యంలో రెండు సంవత్సరాల కాలంలో పూర్తి అవ్వాల్సిన పనులు 5 సంవత్సరాలుగా నత్తనడకన పనులు జరుగుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విషయమంతా తెలిసిన ఇరిగేషన్ అధికారులు సైలెంట్ గా ఉండటం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు వెంటనే ఆయకట్ట పనులు పూర్తిచేయాలని త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఆయకట్టు బ్రిడ్జి పనులు వారం రోజుల్లో మొదలు పెడతాము:
(అశోక్ కుమార్ ఇరిగేషన్ సిఈ)

“పెద్ద చెరువు ఆయకట్ట,బ్రిడ్జి పనులు ఒక వారం రోజుల్లో మొదలు పెడతాము. కాంట్రాక్టర్కు నోటీసులు పంపించాము. అతను కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. నేను ఈ పరిధిలోకి వచ్చి రెండు రోజులు మాత్రమే అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కాంట్రాక్టర్ను పిలిపించి. ఆయకట్ట పనులు బ్రిడ్జి పనులు త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు చేపడుతాము… రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా పనులు చేపడతా”మని చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News