గార్ల మండల పరిధిలోని కొత్త తండా మద్దివంచ గ్రామాలలో రైతులు సాగు చేసుకుంటున్న భూములను మూడవ రైల్వే లైన్ కింద భూములను కోల్పోతున్న నిర్వాసితులకు నష్టపరిహారం కల్పించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు గౌని భద్రయ్య అన్నారు గార్ల మండల కేంద్రంలోని స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో శనివారం న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి తాసిల్దార్ రవీందర్ కు వినతి పత్రం అందజేశారు.
మద్దివంచ రెవెన్యూ పరిధిలో సర్వేనెంబర్ 116 లోని వ్యవసాయ సాగు భూముల్లో తాతల ముత్తాతల నుండి సాగు చేసుకుంటున్న ఆ భూములనే నమ్ముకొనే వ్యవసాయం చేసుకునే జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వారు మూడో రైల్వే లైన్ కొరకు మా భూములను సర్వే చేసి హద్దులు పెడుతున్నారని గత సంవత్సరం కింద రెవెన్యూ అధికారులు వచ్చి గ్రామ సభ పెట్టి సాగులో ఉన్న రైతులకు నష్టపరిహారం చెల్లిస్తా అని చెప్పి ఇంతవరకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా భూములను సర్వే మొదలు పెడుతున్నామని చెబుతూ కొంతమంది రైతులకు నష్టపరిహారం అందిచి మరి కొంతమంది రైతులకు ఎలాంటి నష్టపరిహారం అందలేదని వాపోతున్నారు.
బాధిత రైతులు.. 1 మారుతి శ్రీరాములు 2 లక్కం వెంకన్న 3 సపోర్టు ఇస్లా 4 సభావత్ లచ్చు 5 గౌడి మంగయ్య 6 బాద్షా జయమ్మ 7 వెంకటేశ్వర్లు 8 చౌకాల బిక్షం 9 మండల రంగారావు 10 ముండ్ల నాగేశ్వరరావు 11 చిర్ర లక్ష్మీ ప్రసన్న అలా రైతులకు హద్దులు పెట్టి వారి నష్టపరిహారం రాలేదు అందుకని తమరు మళ్ళీ సర్వే చేసి వారికి రావాల్సిన నష్టపరిహారం వెంటనే చెల్లించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు వినతి పత్రంలో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గౌని మల్లేశం , బావు సింగ్, భాస్కర్, కృష్ణయ్య రంగారావు లచ్చు.