Saturday, November 23, 2024
HomeతెలంగాణKTR for Rakesh Reddy: రాకేష్ రెడ్డి గెలుపు కోసం శ్రమిస్తున్న కేటీఆర్

KTR for Rakesh Reddy: రాకేష్ రెడ్డి గెలుపు కోసం శ్రమిస్తున్న కేటీఆర్

అమెరికా వెళ్లకుండా ప్రజాసేవ ఎంచుకున్న నేత

ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరిలో జరిగిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

- Advertisement -

కేటీఆర్ కామెంట్స్

“మోడీ పదేళ్ల క్రితం ఇచ్చిన హామీలు మీకు తెలుసు.. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా అన్నారు..విదేశాల నుంచి మన పాస్ పోర్ట్ కోసం ఎగబడేలా చేస్తా అన్నారు మోడీ.. ఒక్కరికి కూడా మోడీ చేసింది ఏమీ లేదు, రైతుల ఆదాయం డబుల్ చేస్తా అని మోడీ గారు అన్నారు. ఒక్క రైతుకన్నా ఆదాయం డబులైందా? ఏం చేశారంటే మేము గుడి కట్టినం అంటారు. అంతకుమించి సమాధానం రాదు, గుడి కట్టడమే ప్రతిపాదిక అయితే కేసీఆర్ యాదాద్రి కట్టలేదా? ఒక్క గుడి మాత్రమే కాదు. ఆధునిక దేవాలయాలుగా చెప్పబడే ప్రాజెక్ట్ లు, రిజర్వాయర్లు కట్టారు, వాటన్నింటికి కూడా దేవుళ్ల పేర్లే పెట్టారు. దేవాలయాలు, ఆధునిక దేవాలయాలను కూడా కేసీఆర్ కట్టారు. అయితే మనం చేసిన పనిని పూర్తి స్థాయిలో ప్రజలకు చెప్పుకోలేకోపోయాం. అదే ఓటమికి కారణం, కొన్ని వర్గాలను అనుకోకుండా దూరం చేసుకున్నాం, ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధికంగా జీతాలు ఇచ్చినప్పటికీ దాన్ని చెప్పుకోలేకపోయాం, దేశంలో అత్యధికంగా రెండు లక్షల ఉద్యోగాలను ఇచ్చినప్పటికీ చెప్పుకోలేకపోయాం, ప్రత్యర్థులు మాత్రం వాళ్ల మీడియా, సోషల్ మీడియా ద్వారా మన మీద తప్పుడు ప్రచారం చేశారు” అంటూ కేటీఆర్ ప్రసంగం సాగింది.

ఇప్పుడు తెలంగాణకు కావాల్సింది అధికార స్వరాలు కాదు…ధిక్కార స్వరాలన్న కేటీఆర్.. భువనగిరి పరిధిలోనే 13 వేల మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారని, సమయం తక్కువగా ఉంది. గ్రాడ్యుయేట్ నియోజకవర్గం పరిధి చాలా పెద్దది. కనుక పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచార బాధ్యత తీసుకోవాలన్నారు. విద్యావంతుడు, బిట్స్ పిలానీలో చదువుకున్న వ్యక్తి, సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రాకేష్ రెడ్డి, అమెరికాలో కోట్లు సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ ఆయన ప్రజాసేవ కోసం దేశానికి వచ్చారని, రాబోయే వారం రోజుల పాటు కష్టపడి పనిచేయాలన్నారు కేటీఆర్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News