Saturday, April 19, 2025
HomeతెలంగాణJadcharla: పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

Jadcharla: పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

20 ఏళ్ల తరువాత క్లాస్మేట్స్..

జడ్చర్ల డాక్టర్. బూర్గుల రామ కృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో 2001-04 లో డిగ్రీ పూర్తి చేసుకున్న బీకాం విద్యార్థులు 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కళాశాలలో ఆత్మీయ కలయిక ఏర్పాటు చేసుకున్నారు. సుమారు 35 మంది పూర్వ విద్యార్థులు కళాశాలలో సమావేశం ఏర్పాటు చేసుకొని గత స్మృతులను నెమరు వేసుకున్నారు.

- Advertisement -

ఆనాడు తాము కూర్చున్న తరగతి గదులు, కళాశాల ప్రాంగణం అంతా కలియతిరిగి, అప్పట్లో తాము చేసిన అల్లరి, తాము చదువుకున్న ప్రదేశాలు అన్నీ గుర్తు చేసుకున్నారు. తాము చదువుకున్నప్పటికీ ఇప్పటికీ కళాశాల ఎంతో అభివృద్ధి చెందిందని అభివృద్ధికి కృషి చేసిన అధ్యాపకులను స్మరించుకున్నారు. అనంతరం కళాశాలలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్ ను సందర్శించి ప్రతి ఒక్కరు సీత అశోక మొక్కను నాటారు.

కార్యక్రమంలో బొటానికల్ గార్డెన్ సమన్వయకర్త డాక్టర్. సదాశివయ్య, పూర్వ విద్యార్థులు జగదీశ్వర్ రెడ్డి, హరికుమార్, రంజిత్ కుమార్, రామచంద్రయ్య, భాగ్యలక్ష్మి, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News