పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అనీ సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు, బొల్లం అశోక్ అన్నారు. సిపిఎం పార్టీ మండల కార్యాలయంలో పార్టీ మండల కమిటీ సభ్యులు సోమిరెడ్డి అధ్యక్షతన పుచ్చలపల్లి సుందరయ్య 39 వ వర్ధంతి సభ జరిగింది.
ఈ సభకు ముఖ్యఅతిథిగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అశోక్ పాల్గొని మాట్లాడుతూ, పీడిత ప్రజల ఆశాజ్యోతి దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత నిస్వార్ధంగా పార్టీ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహానీయుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని పారు కొనియాడారు. ఆ రోజుల్లోనే ధనిక కుటుంబంలో జన్మించిన సుందరయ్య పీడిత ప్రజల కోసం వ్యవసాయ కూలీలకు సన్నా-చిన్నకారు రైతుల కోసం అనేక పోరాటాలు నిర్వహించి దున్నేవాడికి భూమి దక్కాలని, వ్యవసాయ కూలీలకు కనీస వేతనాలు చెల్లించాలని వారి పేదలను కలుపుకొని అనేక పోరాటాలు చేశారు. పిల్లలు ఉంటే సమాజానికి సేవ చేయలేమని భావించిన ఆయన భార్య లీలావతికి కుటుంబ నియంత్రణ చేయించి సమాజ సేవలు అందించిన గొప్ప ఆదర్శ దంపతులు సుందరయ్య అని వారి సందర్భంగా గుర్తు చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం హర్నిశలు పాటుపడుతూ, తాను నమ్మిన సిద్ధాంతాలకు చివరి వరకు కట్టుబడ్డ మహనీయుడు సుందరయ్య అని వారు తెలిపారు.
మార్క్సిస్టు సైదాంతిక భావాజాలంగల నేతగా ఆయన ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారని
సుందరయ్య జీవితం ఆదర్శవంతమైనదనీ ఈ తరం నేతలు ఆయనను మార్గదర్శకంగా తీసుకోవాలనీ పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీ కార్యకర్తలు నిత్యం ప్రజలతో ఉండి వాటిని ఎండ గడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయాలనీ వారు కార్యకర్తలను కోరారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు డోనకదుర్గయ్య, తాళ్ల వెంకటేశ్వర్లు, పున్నం సారయ్య, జంజిరాల శంకర్, కొండ రాము, తిమ్మిడి రవి తదితరులు పాల్గొన్నారు.