Friday, November 22, 2024
HomeతెలంగాణRajanna Sirisilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏసీబీ రైడింగ్

Rajanna Sirisilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏసీబీ రైడింగ్

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్

రాజన్న సిరిసిల్ల జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న భాస్కర్ రావు రూ.7 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

- Advertisement -

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ వెంకటేష్ సుమారు రూ.4 లక్షల ముప్పై ఎనిమిది వేలతో నిర్మించిన స్మశాన వాటిక కాంపౌండ్ వాల్ బిల్లు కోసం నాలుగు నెలలుగా తిప్పుతూ, చీఫ్ ప్లానింగ్ అధికారికి పంపించడం కోసం రూ.ఎనిమిది వేలు లంచం డిమాండ్ చేయడంతో వెంకటేష్ ఏసీబీని సంప్రదించినట్లు డీఎస్పీ వీవీ రమణమూర్తి తెలిపారు.

కాగా సోమవారం 7వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా భాస్కర్ రావును పట్టుకున్నట్టు, భాస్కర్ రావును కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు ఆయన తెలిపారు. అవినీతి అధికారులతో

ఇబ్బందులు పడుతున్న బాధితులు ఏసీబీ డీఎస్పీ 9154388954, సర్కిల్ ఇన్స్పెక్టర్లు 9154388955, 9154388956 నెంబర్లను సంప్రదించాలని ఈ సందర్భంగా డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News