త్వరలో గ్రామ స్థాయిలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అంతా సిద్ధంగా ఉండాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు.
గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశానికి గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఇంటికి సంక్షేమం ప్రతి వాడకు అభివృద్ధి లక్ష్యంతో పాలనను కొనసాగిస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఇప్పటికి ఐదు గ్యారెంటీలను అమలుచేసి ప్రజలందరికీ అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసంతో ఉన్నారని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తమ తమ గ్రామాలలో అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని సూచించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో స్థానిక సంస్థల్లో సైతం ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలు ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహులు ప్రజల మద్దతు చూరగొనేలా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు భూమ్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డి, మామిడాల శ్రీనివాస్, నరసింహారెడ్డి, సలీం, కృష్ణ రెడ్డి, గాడిపల్లి భాస్కర్, మామిండ్ల కృష్ణ,నియోజకవర్గ సీనియర్ నాయకులు, మండల స్థాయి నాయకుడు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.