అన్నమయ్య సంకీర్తనల ప్రచారంలో భాగంగా ప్రతి శనివారం నిర్వహిస్తున్న “అన్నమయ్య స్వరార్చన”లో నటరాజ నృత్య కళాకేంద్రం నృత్య గురువు నాగమణి నేతృత్వంలో మూషిక వాహన, బ్రహ్మ మొక్కటే, వేడుకుందామా, వినరో భాగ్యము, నగ్గుమోము, భావములోన, బృందావన థిల్లానా, రామాయణ శబ్ధం పాటలకు వైష్ణవి, ఖ్యాతి, ప్రణతి, వందిత, సాయి రియన్షీ, హర్షిని, నిహారిక, వర్షితలు కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు మరియు కోలాటం పై మహేశ్వరి, రాణి, ఝాన్సి, విజయ పాల్గొన్నారు. కార్యక్రమంలో చివరిగా అన్నమాచార్య భావనా వాహిని అధ్యక్షులు “పద్మ శ్రీ” అవార్డు గ్రహీత డాక్టర్ శోభారాజు అన్నమయ్య పాటలోని కొన్ని విశేషాలను విచ్చేసిన భక్తులకు వివరించారు. అనంతరం నృత్య ప్రదర్శన చేసిన కళాకారులను డాక్టర్ శోభా రాజు సత్కరించారు.