Saturday, September 28, 2024
Homeఆంధ్రప్రదేశ్AP govt school bags: జూన్ 12 నుంచి స్కూల్ బ్యాగుల పంపిణీ

AP govt school bags: జూన్ 12 నుంచి స్కూల్ బ్యాగుల పంపిణీ

ట్యాబ్ తో పాటు అన్నీ పట్టేలా..

జూన్ 12 న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. నోయిడా లో స్కూల్ బ్యాగులు తయారు చేసే ఫ్యాక్టరీని సందర్శించిన పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఈ మేరకు స్కూలు బ్యాగుల నాణ్యతను స్వయంగా పరిశీలించారు.

- Advertisement -

స్కూల్ బ్యాగుల నాణ్యత బాగుందని, జూన్ 5 నాటికి సరఫరా చేయాలన్న కంపెనీ నిబద్దత పై ప్రవీణ్ ప్రకాష్ ప్రశంసలు కురిపించారు. విద్యాకానుక కిట్ లో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించే స్కూల్ బ్యాగులు తయారు చేసే ఫ్యాక్టరీని పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ సందర్శించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యాకానుక కిట్ లో ప్రధానమైన స్కూల్ బ్యాగుల నాణ్యత బాగుందని కొనియాడారు. ఎట్టి పరిస్థితిలోను జూన్ 5, 2024 నాటికి విద్యాకానుక బ్యాగులను సరఫరా చేయాలన్న నోయిడా కంపెనీ నిబద్దత ఆకట్టుకుందన్నారు. స్కూల్ బ్యాగ్ 45 సెంటీమీటర్ల పొడవు, 33 సెంటీమీటర్ల వెడల్పు మరియు 15 సెంటీమీటర్ల లోతు, 0.42 mm మందంతో ఉందన్నారు. పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్‌లు, ట్యాబ్ లు మరియు ఇతర ముఖ్యమైన వస్తువులను బ్యాగ్ లో ఉంచడానికి సరిపోయేంత పరిమాణంలో బ్యాగ్ ఉందని వివరించారు.

సంవత్సర కాలంగా ఉండేందుకు సరిపోతుంది అన్నారు. విద్యార్థులు తమ అన్ని ముఖ్యమైన అధ్యయన సామాగ్రిని తీసుకువెళ్లేందుకు వీలుగా తయారవుతున్న స్కూల్ బ్యాగులు విద్యార్థులకు వరం లాంటిదన్నారు. ఈ బ్యాగులను జూన్ 12, 2024 న విద్యార్థులకు పంపిణీ చేయనున్నామన్నారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News