Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: కోటేష్ కుంచె నుండి జాలువారిన ఎన్టీఆర్ చిత్రాలు

Nandyala: కోటేష్ కుంచె నుండి జాలువారిన ఎన్టీఆర్ చిత్రాలు

ఎన్టీఆర్ అభిమాని కళా హృదయం ఇది

నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటీష్ నందమూరి తారక రామరావు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని అద్భుతమైన ఎన్టీ ఆర్ చిత్రాలను అన్నవారి అభిమానుల కోసం
తన చిత్రకళను ఆవిష్కరించారు. ఇందులో ఎన్టీఆర్ విశ్వరూపం చిత్రాన్ని తైలవర్ణంలో వేసారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ కుమారుడు బాలక్రిష్ణ కు అందజేసారు.

- Advertisement -

ఎన్టీఆర్ నటించిన సినిమా పేర్లతో అన్న చిత్రం వేసారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ కుమార్తె, పురేందేశ్వరికి
అందజేసారు. కాఫీ పొడిని నీటిలో కలుపుకొని భీష్మది గెటప్ లో ఎన్టీఆర్ అపురూప చిత్రం వేసారు. పసుపు, కుంకుమ, సింధూరం వంటి పూజాద్రవ్యాలలో భీముని గెటప్ లో ఎన్టీఆర్ చిత్ర రాజాన్ని వేశారు. ఎన్టీఆర్ కృష్ణుడి పాత్రలో వేసిన చిత్రాల పేర్లలో శ్రీకృష్ణుడి గెటప్ వేసారు. కేవలం కలర్ పెన్సిలతో బ్రహ్మనాయుడు గెటప్ అద్భతంగా వేసారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News