Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్Old Pension: పెన్షన్‌ గందరగోళం

Old Pension: పెన్షన్‌ గందరగోళం

కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఇ.పి.ఎఫ్‌.ఓ) కొందరు పెన్షనర్లు, సబ్యస్కైబర్లు అధిక పెన్షన్‌ పొందడానికి ఈ అవకాశం ఇవ్వడంపై ప్రస్తుతం ఆయన మల్లగుల్లాలు పడుతున్నారు. 2014 సెప్టెంబర్‌ 1వ తేదీనాటికి ఉద్యోగాలలో ఉన్నవారు అత్యధిక పెన్షన్‌ ఎంపికను ఉపయోగించుకోవడానికి సుప్రీంకోర్లు తీర్చ ప్రకారం ఇంకా నాలుగు నెలల గడువే ఉంది. ఈ లోగా చట్టపరమైన, ఆర్థిక సంబంధమైన, విధి విధానాల సంబంధమైన, వాస్తవికమైన వివరాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందంటూ ఆయన చెప్పడాన్ని బట్టి ఆయన దాటివేత విధానాన్ని అనుసరిస్తున్నట్టు అర్థమవుతూనే ఉంది. పెన్షనర్లకు ఇది ఏమాత్రం భరోసా ఇవ్వడం లేదన్నది వాస్తవం. అధిక పెన్షన్‌కు అనుమతించే అంశం మొదటి నుంచీ ప్రావిడెంట్‌ ఫండ్‌ వ్యవస్టను ఇబ్బంది పెడుతూనే ఉంది. వాస్తవానికి, ఉద్యోగుల నుంచి [ప్రావిడంట్‌ ఫంద్‌కు సంబంధించిన వాటాను వసూలు చేయడానికి చట్టబద్ధమైన పరిమితి ఉంది. అది 12 శాతం. అయితే, కొన్ని సంస్థలు ఈ 12 శాతానికి మించి వసూలు చేయడం జరిగింది.

దీర్హకాలికంగా లాభదాయకత కొనసాగడానికి ప్రావిడెంట్‌ ఫండ్‌ సంస్ధ 12 శాతం పెన్నన్‌ పథకానికి తరలిస్తుంది. ఇందులో 8.33 శాతం వాటాను ఉద్యోగుల జీతం నుంచి తీసుకుంటుంది. మిగిలిన 1.16 శాతాన్ని ప్రభుత్వం బదిలీ చేస్తుంది. అయితే, ఇందుకు ఉద్యోగుల జీతం 15 వేల రూపాయలకు మించకూడదు. కాగా, పెన్షన్‌ను మదింపు చేయడంలో కనిపిస్తున్న వాస్తవిక లోటు, ఈ పెట్టుబడులు, ఉద్యోగాల విరాకాలపై వస్తున్న తక్కువ ప్రతిఫలాలు, పెన్సనర్ల ఆయుర్దాయం క్రమంగా పెరుగుతుండడం వంటి కారణాల వల్ల ఈ అధిక పెన్నన్‌కు గట్టి వ్యతిరేకత ఎదురవుతోంది. పెన్షనర్లకు అధికంగా పెన్షన్‌ చెల్లించడం వల్ల ప్రావిడెంట్‌ ఫండ్‌ సంస్థ ఆర్థిక వనరులు అతి తక్కువ కాలంలోనే అడుగంటిపోయే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రావిడెంట్‌ ఫండ్‌ సంస్థ ఆందోళన చెందడంలో అర్థం ఉంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్‌లో ఉన్న 11(8) పారాగ్రాఫ్‌లో సవరణలు చేసినప్పటికీ ఇవి ఏమాత్రం ప్రావిడెంట్‌ ఫండ్‌ సంస్థకు సహాయకారిగా లేవు. అధిక పెన్నన్‌కు సంబంధించిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోవాలని ఈ పారాగ్రాఫ్‌ సూచిస్తోంది.

- Advertisement -

వాస్తవానికి, 2014 సెప్టెంబర్‌లో ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీమ్‌ నుంచి ఈ పారాగ్రాఫ్‌ను తొలగించి, సవరణలు చేయడం జరిగింది కానీ, అధిక పెన్నన్‌ అనే మాట మాత్రం కొనసాగుతూనే ఉంది. పైగా యజమానులు, ఉద్యోగులు జాయింట్‌ ఆప్నన్‌ను అంటే ఉమ్మడి ఎంపికను అమలు చేయడానికి ఈ సవరణలు 12 నెలల కాలం పాటు అవకాశం ఇచ్చాయి. ఆ కారణంగానే పెన్ననర్‌లకు సంబంధించిన వివిధ అంశాలు అధిక ‘పెన్నన్‌కు సంబంధించిన వారి డిమాండ్లను సమర్థించడం జరిగింది. ఇందుకు ప్రధాన కారణం, ఉద్యోగులు సర్వీసులో ఉన్నప్పుడు వారి సంస్థల యజమానులు వారి జీతాల నుంచి పరిమితికి మించి వారి వాస్తవిక వేతనం నుంచి విరాళాలు సేకరించడం జరిగింది. ఇక, 2014 సెప్టెంబర్‌కు ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు అధిక పెన్నన్‌ కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఫలితంగా అధిక పెన్నన్‌ కోసం పోరాటాలు, పోటీలు ప్రారంభం కావడానికి అవకాశం కలిగింది. సుప్రీంకోర్టు 2022 నవంబర్‌లో ఇచ్చిన తీర్పునకు ఇది విరుద్ధంగా ఉంది.

ఇది సుప్రీంకోర్టు 2016లో ఇచ్చిన తీర్చును ఆధారం చేసుకుని తాజా తీర్చు ఇవ్వదం జరిగింది. ఈ రెండు తీర్పులు కూడా పెన్నన్‌దారులు అత్యధిక ప్రయోజనం పొందేందుకే వెలువడడం జరిగింది. ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ సర్యులర్‌ వల్ల 2016 నాటి అధిక పెన్షన్‌ కేసులను మళ్లీ తెరవడం, వసూళ్ల ప్రక్రియలను ప్రారంభించడం వంటివి ప్రారంభం అయ్యాయి. ఇదంతా పుండు మీద కారం రాసిన వ్యవహారంగా తయారయింది. న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను అటు ప్రభుత్వం, ఇటు ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ సంస్ట ‘పెన్నన్‌దారులకు తేటతెల్లంగా వివరించాల్సిన అవసరం ఉంది. అయితే, అధికారులు ‘హస్వదృష్టితో వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. సరళంగానే ఉన్నట్టు కనిపిస్తున్న చట్టపరమైన అంశాలు, వాటికి సమ్మతి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడడం వంటివి ప్రావిడెంట్‌ ఫండ్‌ సంస్థకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. పెన్ననర్లలో ఇది ఆశలు పెంచినప్పటికీ, దాంతో పాటే ఆందోళన కూడా పెంచడం వల్ల (ప్రభుత్వం, ప్రావిడెంట్‌ ఫండ్‌ సంస్థ ఇకనైనా మేల్మొని మాజీ ఉద్యోగులకు పరిస్టితిని వివరించడంతో పాటు, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం కూడా చేయాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News