ఆమెను ఫ్యాన్స్ అంతా ప్రేమగా పున్నాగై అరసి అని పిలిచేవారు. అంటే పున్నాగపూల వంటి నవ్వులు కలది అని అర్థం. అందుకే ఆ హీరోయిన్ కు పున్నాగై అరసి అనే ముద్దుపేరు పెట్టుకుని ఆరాధించేవారు ఆమె ఫాలోయర్స్. దశాబ్దాలపాటు ఆమె సిల్వర్ స్క్రీన్ పైన ఎన్నో రోల్స్ ప్లే చేసి మహానటిగా తన ప్లేస్ ను పదిలం చేసుకున్నారు. సౌత్ ఇండియాలో ఆమె చాలా మంచి యాక్ట్రెస్ అనే పేరు వచ్చిందంటే దానికంతా కారణం తాను యాక్ట్ చేసిన అన్ని సినిమాల్లోనూ ఆమె చాలా నాచురల్ గా లైవ్లీగా కనిపించటమే. సిల్వర్ స్క్రీన్ దేవత అదేనండి మన కేఆర్ విజయ.
సౌత్ ఓల్డ్ యాక్ర్టెస్ లో కచ్ఛితంగా ఉండే పేరు
ఓల్డ్ యాక్ట్రెస్ లిస్ట్ తీస్తే.. కచ్ఛితంగా ఉండే పేరు కేఆర్ విజయ. సౌత్ ఇండియాలో మకుటం లేని మహారాణిగా ఆమె జిగేల్ మని వెలిగేవారు. రియల్ లైఫ్ లో ఏమాత్రం కాంట్రవర్సీలు లేని స్టార్ యాక్టర్ విజయ. కానీ స్క్రీన్ మీద మాత్రం అన్ని రకాల ఎమోషన్స్ సూపర్బ్ గా పండించేవారు.
కేఆర్ విజయ అసలు పేరు దైవనాయకి. కానీ ఈపేరు ఆడియన్స్ కు పెద్దగా తెలియదు. కేఆర్ విజయ అంటే వెంటనే కనెక్ట్ అవుతారు. సో స్క్రీన్ నేమ్ తోనే ఆమె పాపులర్ అయ్యారు. విజయ తల్లిదండ్రులకు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తో గట్టి సంబంధాలే ఉన్నాయి. అందుకే ఈ భాషలన్నీ వాళ్లకు కొట్టినపిండి. నాయర్ ఫ్యామిలీలో విజయ పుట్టారు. వీళ్ల ఫ్యామిలీలో అందరికీ యాక్టింగ్ అంటే ప్రాణం.
నాన్న కలతో సినిమాల్లో ఎంట్రీ
తండ్రి ఆర్మీలో ఉద్యోగం చేసేవారు. ఒక తమ్ముడు, నలుగురు అక్క చెల్లెళ్లుండేవారు ఆమెకు. అయితే విజయను ఎలాగైనా యాక్ట్రెస్ చేయాలనేది విజయ వాళ్ల నాన్న డ్రీమ్. ఎందుకంటే ఆయనకు యాక్టింగ్ అంటే చెప్పలేనంత ఇష్టం. ఆర్మీలో ఉంటూ కూడా ఛాన్స్ దొరికినప్పుడంతా నాటకాల్లో యాక్ట్ చేసేవారు. అంతేకాదు మన హీరోయిన్ రాధిక ఉందిగా వాళ్ల ఫాదర్ ఎంఆర్ రాధకు డ్రామా కంపెనీ ఉండేది. అందులో విజయ ఫాదర్ కూడా మెంబర్. ఆర్మీ నుంచి విజయ ఫాదర్ రిటైర్ అయ్యాక ఈ డ్రామా కంపెనీలో ట్రూప్ లో ఆయన యాక్టివ్ గా ఉండేవారు.
ఫస్ట్ సినిమానే హీరోయిన్ గా..
ఇక కేఆర్ విజయ ఫిల్మోగ్రఫీ లోతుల్లోకి వెళితే మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. ఆమె తన కెరీర్ ను హీరోయిన్ గానే స్టార్ట్ చేశారు. ఫస్ట్ సినిమాలోనే ఆమె హీరోయిన్ గా యాక్ట్ చేయటం హైలైట్. హీరోయిన్ గా ఫేడవుట్ అయ్యే టైంలో క్యారెక్టర్ రోల్స్ కు షిఫ్ట్ అయ్యారు. ఇక బిజియెస్ట్ లైఫ్ ను సౌత్ ఇండస్ట్రీలో ఎంజాయ్ చేసే స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయారు.
దేవతల రోల్స్ ప్లే చేయాలంటే. అది కేఆర్ విజయ ఓన్ క్యారెక్టర్ అన్నట్టుండేది వ్యవహారం. ఈ విషయంలో డైరెక్టర్స్ ఫస్ట్ ఛాయిస్ కేఆర్ విజయనే. సౌత్ ఇండియాలో ఏ సినిమాలోనైనా అమ్మవారి వేషం పర్మినెంట్గా వేసింది విజయనే. ఫిల్మీ దేవతగా ఆమె మారిపోయారు. దక్షిణాదిలో అమ్మవారి గెటప్ అనగానే మ్యాగ్జిమం ఆ రోల్ కు ఆమెనే తీసుకునేవారు. ఆమె ట్రాక్ రికార్డ్ లో కూడా మీకు ఎక్కువ దేవత పాత్రలే కనిపిస్తాయి.
500కు పైగా సినిమాల్లో యాక్ట్ చేసి..
ఈ జనరేషన్ వారికి విజయ గురించి సింపుల్ గా చెప్పాలంటే. వెరీ సింపుల్. శ్రీరామ రాజ్యం సినిమాలో కౌసల్య రోల్ ప్లే చేసింది మన లెజెండరీ యాక్టర్ కేఆర్ విజయనే. 500కు పైగా సినిమాల్లో యాక్ట్ చేసిన గ్రేట్ యాక్టర్ విజయ. తెలుగు, తమిళం, మళయాళంలో ఒక్కో భాషలో వందకు పైగా సినిమాల్లో యాక్ట్ చేశారు. జస్ట్ సినిమాలతోనే ఆమె తన కెరీర్ ను సరిపెట్టుకోలేదు. టెలివిజన్ సీరియల్స్ కూడా తన సత్తా చాటారు. అదికూడా ఇండియాలోనూ శ్రీలంకలోనూ. రెండు దేశాల్లో టెలికాస్ట్ అయ్యే టీవీ సీరియల్స్ లో ఆమె యాక్ట్ చేసి తన ఫ్యాన్స్ కు ఎప్పుడూ రీల్ మీద దగ్గరగా ఉండేవారు. అందుకే విజయకున్న ఫ్యాన్ బేస్ చాలా పెద్దది. మరే హీరోయిన్ కు ఇంత పెద్ద ఫ్యాన్ బేస్ లేదనే చెప్పాలి. టీవీ సీరియల్స్, టెలివిజన్ షోలద్వారా ఆమె ఆడియన్స్ కు దగ్గరవ్వటం కాస్త డేరింగ్ స్టెప్ అనే చెప్పాలి. కానీ ఆమె దీన్నికూడా ఛాలెంజ్ గా తీసుకున్నారు. మళయాళం, తమిళ్ లో చాలా సీరియల్స్ లో ఆమె చాలాకాలంపాటు యాక్ట్ చేశారు.
ప్రైవేట్ జెట్ కొని హీరోయిన్స్ కు రోల్ మోడల్ గా..
లగ్జరీ లైఫ్ కు కేరాఫ్ గా కేఆర్ విజయను ఇప్పటికీ ఫిలిం ఇండస్ట్రీ గొప్పగా చెప్పుకుంటుంది. ఎందుకంటే ఆమె అలా తన పర్సనల్ లైఫ్ ను మ్యానేజ్ చేసేవారు. ఏకంగా ఓ ప్రైవేట్ జెట్ కూడా ఆమె మ్యానేజ్ చేసేవారంటే అదికూడా ఆ టైంలో. సొంతంగా ప్రైవేట్ జెట్ ఉన్న అప్పటితరం యాక్ట్రెస్ లో ఫస్ట్ యాక్ట్రెస్ కేఆర్ విజయనే. ఇది ఆమె రికార్డ్. ఇప్పుడున్న హీరోయిన్స్ నయనతార వంటివారంతా ఇలాంటి లగ్జరీ లైఫ్ స్టైల్ ను కేఆర్ విజయ నుంచే కాపీ చేస్తున్నారనే విషయం మీకు తెలుసా?
బిజినెస్ మ్యాన్ తో పెళ్లి
పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమె ఓ బిజినెస్ మ్యాన్ ను మ్యారేజ్ చేసుకున్నారు. సుదర్శన్ ట్రేడింగ్ కంపెనీకి సుదర్శన్ వేలాయుథన్ నాయర్ సీఈఓగా ఉండేవారు. ఈయన్నే విజయ మ్యారేజ్ చేసుకున్నారు. విజయతో మ్యారేజ్ తరువాత ఆయన ఫిలిం ప్రొడ్యూసర్ గా కూడా మారారు. వీరిద్దరీ ఓ కుమార్తె. పేరు హేమలత. తమిళ్, మళయాళం, తెలుగు, కన్నడలో ఆమె చాలా రోల్స్ ప్లే చేశారు. 60 ఏళ్లకుపైగా ఆమె యాక్టింగ్ కెరీర్ కంటిన్యూ చేశారు. 1963లో ఆమె సెల్యులాయిడ్ పై ఫస్ట్ టైం కనిపించారు. ఆతరువాత మోస్ట్ డిమాండింగ్ యాక్ట్రెస్ గా ఎదిగారు.
ఫ్యామిలీ అంతా యాక్టర్సే
సౌత్ ఇండియాలో స్టాల్ వర్ట్స్ అని పాపులర్ అయిన అందరితోనూ స్క్రీన్ షేర్ చేయటం విజయ స్పెషాలిటీ. లైఫ్ టైం అఛీవ్మెంట్ అవార్డ్, ఫిలిం ఫేర్ అవార్డ్, నంది అవార్డ్, తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ అవార్డ్స్, కేరళ స్టేట్ ఫిలిం అవార్డ్స్, నాగి రెడ్డి అవార్డ్, టెలివిజన్ అవార్డ్స్ ఈమెకు వచ్చాయి. సావిత్రి, జమున వంటి లెజెండరీ యాక్ట్రెస్ లతో సమానంగా ఇమేజ్, పాపులారిటీ సంపాదించుకున్న టాల్ యాక్ట్రెస్ విజయ. అందం, అభినయం రెండూ ఉన్న హీరోయిన్. కేఆర్ విజయ సిస్టర్ కేఆర్ వత్సల తమిళ, కన్నడలో హీరోయిన్ గా యాక్ట్ చేశారు. చాలా టీవీ సీరియల్స్ లో యాక్ట్ చేశారు. ఇంకో చెల్లి కేఆర్ సావిత్రి, ఈమె మళయాళంలో మంచి యాక్ట్రెస్. తమిళ్ లో కూడా ఈమె బిజీ యాక్ట్రెస్ గా ఉండేవారు. మూడో సిస్టర్ రాగసుధ కూడా తమిళం, కన్నడ, మళయాళం, తెలుగు సినిమాల్లో యాక్ట్ చేశారు. కేఆర్ విజయ తన సిస్టర్స్ ను సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీల్లోకి తీసుకువచ్చారు. ఆఖరుకి తన చెల్లెలు పిల్లలు కూడా సినిమాల్లో, సీరియల్స్ లో యాక్ట్ చేశారు. కానీ ఆమె తన సొంత కూతురుని మాత్రం ఇండస్ట్రీకి దూరంగా పెట్టారు. ఒకప్పుడు మళయాళంలో అనూష అనే టాప్ హీరోయిన్ ఉండేవారు. ఈమె కూడా కేఆర్ విజయ సిస్టర్ కూతురే. మొత్తానికి విజయ ఫ్యామిలీలో అందరూ యాక్టర్సే అన్నమాట. అంతేకాదు వీళ్ల ఫ్యామిలీలో అందరూ తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం బ్రహ్మాండంగా మాట్లాడేస్తారు. విజయ పేరెంట్స్ కూడా ఇలా అన్ని భాషల్లోనూ మాట్లాడేస్తారు.
విజయకు ఫేవరెట్ యాక్టర్ అంటే చిరంజీవినే. మీనాకుమారి, మధుబాల అంటే ఈమెకు చాలా చాలా ఇష్టం. ఇక ఈమె సౌత్ లో మాత్రమే కాదు బాలీవుడ్ లోనూ యాక్ట్ చేశారు. ‘ఊంచే లోగ్’ అనే హిందీ మూవీలో యాక్ట్ చేశారు.