Saturday, September 28, 2024
Homeచిత్ర ప్రభఇలాంటి సినిమాలు హిట్ అవుతాయంటున్న బాలయ్య

ఇలాంటి సినిమాలు హిట్ అవుతాయంటున్న బాలయ్య

మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తాడు-బాలయ్య

ఈమధ్య సినిమా ఫంక్షన్లలో బాలయ్య తళుక్కుమంటున్నారు. రెగ్యులర్ గా పలు ఇతర సినిమాల కార్యక్రమాలకు హాజరవుతున్న బాలకృష్ణ తన ఫ్యాన్స్ లో నయా జోష్ నింపుతున్నారు. అంతేకాదు అప్కమింగ్ సినిమా టెక్నీషియన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ లో ఆయన హుషారు నింపుతూనే కాన్ఫిడెన్స్ ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఇండస్ట్రీలో నెక్ట్స్ జెనరేషన్ కు ఇలా పెద్ద హీరో కోఆపరేషన్ చాలా సహకరిస్తుందని ఫిలిం నగర్ లో అందరూ హ్యాపీగా రియాక్ట్ అవుతున్నారు.

- Advertisement -

ఇక మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ను మాస్ హీరో బాలయ్య కలిస్తే పుట్టే సందడి మాటల్లో చెప్పలేము. “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” అనే విశ్వక్ సేన్ కొత్త సినిమా ప్రమోషన్ కు బాలయ్య అటెండ్ అవ్వటంతో క్రూలో మరింత ఉత్సాహం పుట్టుకొచ్చింది. కొత్తదనమున్న చిత్రాలను ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అనటం హైలైట్.

తన తనయుడు మోక్షజ్ఞ కూడా సినీ రంగంలోకి వస్తాడని ఈ సందర్భంగా బాలయ్య ప్రకటించారు. వాడికి ఈ తరం హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, అడివి శేష్ వంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని చెబుతుంటానని బాలయ్య చెప్పటం ఆశ్చర్యపరుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News