Friday, November 22, 2024
HomeతెలంగాణWarangal: ఉద్యమంలో పాల్గొనని వారికి సన్మానాలా?

Warangal: ఉద్యమంలో పాల్గొనని వారికి సన్మానాలా?

ఉద్యమకారులను కంటికి రెప్పలా కాపాడుకున్న కెసిఆర్

మలి విడత తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులందరినీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తగిన గౌరవాన్ని ఇచ్చి కంటికి రెప్పలా కాపాడుకున్నారని బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హంత‌కులే సంతాప స‌భ జ‌రిపిన‌ట్లుగా, ఆదివారం ప‌రేడ్ గ్రౌండ్‌లో, సోమవారం జిల్లాలో ఏనాడూ ఉద్య‌మంలో పాల్గొన‌ని వారు ఉద్య‌మ‌కారుల‌ను రేవంత్ సర్కారు స‌న్మానిస్తోందని దాస్యం మండిపడ్డారు. ఉద్య‌మ‌కారుల‌పైకి తుపాకి ఎత్తిన వారు ఉద్య‌మ నేల‌ను పాలిస్తుండ‌డం నిజంగా శోచ‌నీయం అని అన్నారు. తెలంగాణ‌ను వ్య‌తిరేకించిన వారే నేడు తెలంగాణ కోసం కొట్లాడిన తెరాస‌, భారాసను విమ‌ర్శిస్తుండ‌డం విడ్డూరంగా ఉంది అని అన్నారు.

- Advertisement -


10 ఏండ్ల‌లో తెలంగాణ‌ను అన్ని రంగాల్లో అగ్ర భాగాన నిలిపింది కేసీఆర్ అన్న ఆయన, ఉద్య‌మ‌కారుల‌ను జైళ్ల‌లో పెట్టిన‌, కేసుల పాలు చేసిన ఘ‌న చ‌రిత్ర కాంగ్రెస్‌ది అని ధ్వజమెత్తారు. ఓరుగ‌ల్లు నాటి స్వ‌రాష్ట్ర సాధ‌న ఉద్య‌మంలో అగ్ర‌భాగ‌న నిలిచింది అని, నేడు మ‌ర‌లా ప్ర‌భుత్వంపై పోరాడ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది అని స్పష్టం చేశారు. ఓరుగ‌ల్లు ఉనికిని, తెలంగాణ అస్తిత్వాన్ని ఓర్చుకోలేని వారు నేడు అధికారంలో ఉన్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ, ఓరుగల్లు చ‌రిత్ర‌ను ప్ర‌తిబింబించేలా నాడు కేసీఆర్ కాక‌తీయ క‌ళాతోర‌ణాన్ని, చార్మినార్‌ను రాష్ట్ర చిహ్నంలో పొందుపరిచితే నేడు రేవంత్ రెడ్డి స‌ర్కారు కాక‌తీయ క‌ళా తోర‌ణాన్ని, చార్మినార్‌ను రాష్ట్ర చిహ్నం నుంచి తొల‌గిస్తామ‌ని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక‌వేళ కాంగ్రెస్ స‌ర్కారు ఆ చ‌ర్య‌కు పాల్ప‌డితే రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాలో పెద్దెత్తున ఉద్య‌మిస్తాం అని హెచ్చరించారు.
ప్ర‌జ‌ల ప‌క్షాన ప్ర‌భుత్వంపై పోరాడుతాం అని, ఉద్య‌మాలు, పోరాటాలు, కేసులు కొత్త కావు అని తేల్చి చెప్పారు. జిల్లా మంత్రులు సీత‌క్క‌, కొండా సురేఖ కాక‌తీయ క‌ళాతోర‌ణాన్ని, చార్మినార్‌ను రాష్ట్ర చిహ్నం నుంచి తొల‌గించ‌కుండా, ఇక్క‌డి ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను ముఖ్య‌మంత్రికి, ప్ర‌భుత్వానికి తెల‌పాలని సూచించారు.

భార‌త రాష్ట్ర స‌మితి హ‌నుమ‌కొండ జిల్లా కార్యాల‌యంలో తెలంగాణ అవ‌త‌ర‌ణ ద‌శాబ్ది ఉత్స‌వాల‌ను నిర్వ‌హించారు. మొద‌ట అమ‌ర‌వీరుల స్తూపానికి పూల‌మాల వేసి నివాళులు అర్పించారు. జోహార్ తెలంగాణ అమ‌ర‌వీరుల‌కు జోహార్లు అంటూ నిన‌దించారు. త‌ర్వాత , తెలంగాణ త‌ల్లి విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేశారు. అనంత‌రం జాతీయ జెండాను శాస‌న‌మండ‌లి డిప్యూటి చైర్మ‌న్ బండ ప్ర‌కాశ్ ఎగ‌ర‌వేశారు. భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ జెండాను మాజీ చీఫ్ విప్‌, భార‌త రాష్ట్ర స‌మితి హ‌నుమ‌కొండ జిల్లా అధ్య‌క్షులు దాస్యం విన‌య్ భాస్క‌ర్, న‌ర్సంపేట మాజీ శాస‌న‌స‌భ్యులు పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డిఎగ‌ర‌వేశారు. తెలంగాణ ఉద్య‌మ నేప‌థ్యం, సాగిన పోరాటంపై పార్టీ రూపొందించిన 30 నిమిషాల నిడివి గ‌ల ప్ర‌త్యేక‌మైన డాక్యుమెంట‌రీని ప్ర‌ద‌ర్శించారు. తదుపరి వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌వ‌ర్గ వ్యాప్తంగా ఉన్న 1969 ఉద్య‌మ‌కారుల‌ను పూల‌మాల‌లు, శాలువా, మెమొంటోలతో స‌త్క‌రించి, వారి పోరాటాన్ని కొనియాడారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News