ముఖ్యమంత్రిగా 4వ సారి బాధ్యతలు చేపట్టబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు. టీడీపీ చరిత్రలోనే దక్కని భారీ విజయాన్ని ఈసారి టీడీపీ అధినేత ఈసారి చేజిక్కుంచుకున్నారు. అంతేకాదు తన కుమారుడు నారా లోకేష్ ను సైతం ఓడిన అదే మంగళగిరి నుంచి గెలిపించుకున్నారు చంద్రబాబు.
బంపర్ మెజార్టీతో తన సత్తా చాటిన సైకిల్ పార్టీ 9వ తేదీన అమరావతిలో అధికారం చేపట్టనుంది. సీఎంగా చంద్రబాబు అమరావతిలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. చంద్రబాబు కూటమి ప్రభావం ఏ స్థాయిలో ఉందో చెప్పాలంటే ఆఖరుకి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారు కూడా విజయం సాధించారు. ఇది చాలు ఈసారి వైసీపీకి ఉన్న ప్రజా వ్యతిరేకత ఏస్థాయిలో ఉందో చెప్పేందుకు.
మంత్రులందరినీ మట్టి కరిపించిన టీడీపీ ధాటికి వైసీపీ నేతలంతా కుదేలయ్యారు. మీడియా, సోషల్ మీడియాను విస్తృంతగా ఉపయోగించి ప్రజలకు తమ జెండాను, అజెండాను దగ్గర చేసిన చంద్రబాబు టీం ఈ ఎన్నికల్లో సాధించిన విజయం ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజకీయ పరిణతిని చాటుతుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
రాయలసీమలో కూడా జగన్ పార్టీకి అడ్రస్ లేకుండా చేశారు చంద్రబాబు.