వైయస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్‌ను తన క్యాంపు కార్యాలయంలో కలిసిన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు, ఇటీవల ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు.
ప్రజలకు మంచి చేశాం, కచ్చితంగా పార్టీ పునర్ వైభవం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసిన నేతలు. రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో జీవన ప్రమాణాలు పెంచడానికి వైయస్.జగన్ చేసిన విశేష కృషి కచ్చితంగా ప్రజల మనసుల్లో నిలిచిపోతుందన్న నాయకులు.
వ్యవసాయం, విద్య, వైద్యం తదితర రంగాల్లో తీసుకొచ్చిన గణనీయమైన మార్పులు ప్రజల జీవితాలను మార్చేదిశగా గొప్ప అడుగులుగా నిలిచిపోతాయన్న నేతలు. ఈవీఎం మేనేజ్‌మెంట్ అనుమానాలు, ఈసీ–కొంతమంది పోలీసు అధికారుల కుట్రల నేపథ్యంలో కూడా సీట్లు గణనీయంగా తగ్గిపోయిన కూడా 40శాతం ఓటింగ్ రావడం వెనుక ఐదేళ్ల పాటు జగన్ చేసిన కార్యక్రమాలే నిదర్శనమని పేర్కొన్న నేతలు.
గడచిన ఐదేళ్లలో అమలు చేసిన పథకాలు, చేసిన అభివృద్ధి ప్రజల కళ్లముందే ఉందని, ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్తామన్న నేతలు. గడచిన ఐదేళ్లు సుపరిపాలనకు ఒక గీటురాయిలా నిలిచిపోతుందన్న నాయకులు. కొన్నిరోజుల్లో రానున్న కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అమలుపై కచ్చితంగా ప్రజల దృష్టిఉంటుందని, ఈ ఐదేళ్ల పాలనతో కచ్చితంగా బేరీజు వేసుకుంటారన్న నేతలు. మాట మీద నిలబడి, ఇచ్చిన హామీలను నెరవేర్చిన విశ్వసనీయ పార్టీగా వైయస్సార్‌కాంగ్రెస్ పార్టీకి ప్రజల మనసులో చోటు ఉందని, పునర్ వైభవానికి ఇదే గట్టిపునాది అని పేర్కొన్న నేతలు. ఎన్నికలు జరిగిన తీరుపై అనే సందేహాలను వ్యక్తంచేసిన నేతలు.
పక్కా పార్టీ గ్రామాల్లో కూడా ఓట్లు రాకపోవడంపైనా అనుమానాలు వ్యక్తంచేసిన నేతలు. ఈవీఎంల వ్యవహారంపై ఒక పరిశీలన చేయాల్సిన అవసరం ఉందన్న నేతలు. మరోవైపు కూటమి ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో తీవ్ర అక్రమాలకు పాల్పడ్డారన్న నేతలు. ఎన్నికల సంఘం కూటమి అనుకూల అధికారులు, పోలీసు అధికారుల మధ్య కుమ్మక్కు నడిచిందన్న అధికారులు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఉద్దేశ పూర్వకంగా భయభ్రాంతులకు గురిచేశారని, పోలింగ్ సమయంలో భయానక పరిస్థితులు సృష్టించారన్న నేతలు.
రాష్ట్రవ్యాప్తంగా దాడులు:
కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ దాడులపై పార్టీ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్మాదంతో స్వైరవిహారం చేస్తున్నారని, ఎక్కడికక్కడ దాడులకు దిగుతున్నారన్న నేతలు. పార్టీ నాయకులు, కార్యకర్తల ప్రాణాలకు హాని తలపెట్టడమే కాకుండా ఆస్తుల విధ్వంసాలకు దిగుతున్నారన్న నేతలు. పార్టీ శ్రేణులకు అండగా నిలవాలని నాయకులను ఆదేశించిన వైయస్.జగన్. వారికి తోడుగా నిలిచి భరోసా ఇవ్వాలని ఆదేశించిన వైయస్.జగన్. న్యాయపరంగా తీసుకోవాల్సిన వాటిపై పార్టీపరంగా చర్యలు తీసుకుంటున్నామని, గవర్నర్‌గారికి కూడా పార్టీ తరఫున ఫిర్యాదు చేస్తున్నామని తెలిపిన వైయస్.జగన్.