Friday, November 22, 2024
HomeఆటSpeaker Gaddam Prasad says new sports policy soon: త్వరలో క్రీడా పాలసి

Speaker Gaddam Prasad says new sports policy soon: త్వరలో క్రీడా పాలసి

త్వరలో సీఎం దృష్టికి..


క్రీడలకీ సముచిత ప్రాధాన్యత కల్పించి, క్రీడలకు పాలసీని త్వరలో ప్రకటిస్తామని తెలంగాణ శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. ఒలింపిక్ సంఘం క్రీడలకు సహకరిస్తుందని, ఒలింపిక్ సంఘం అధ్యక్షులు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి అన్నారు.
ఈ రోజు 47 వ జాతీయ త్రోబాల్ ఛాంపియన్ షిప్ 2024 పోటీలని ప్రారంభించిన తెలంగాణ శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఒలింపిక్ సంఘం అధ్యక్షులు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి, జాతీయ త్రోబాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రామన్ సాహ్ని, తెలంగాణ త్రో బాల్ అసోసియేషన్ అధ్యక్షులు, ఆర్గనైజింగ్ చైర్మన్, టీపీసీసీ అధికార ప్రతినిధి డా.సత్యం శ్రీరంగం, చీఫ్ ప్యాట్రన్ అమీర్ అలీ ఖాన్, దేశంలోని 26 రాష్ట్రాలకు సంబంధించిన త్రో బాల్ జట్ల క్రీడాకారులు పాల్గొని, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

- Advertisement -

ఈ సందర్బంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ క్రీడలకీ సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని, క్రీడలకు పాలసీని త్వరలో ప్రకటించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళతామని అన్నారు.

ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ కృష్ణ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రవి కుమార్, ఉపాధ్యక్షులు కృష్ణ రాజపుత్, చిత్ర షినోయ్, శ్వేతా రెడ్డి, కోశాధికారి జమీల్, కోచ్ లు, జాతీయ రిఫరీ బోర్డు, వెలువోలు శ్రీనివాస్ రెడ్డి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు విట్టల్, క్రీడాకారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News