Friday, September 20, 2024
Homeహెల్త్Pot curd: మట్టి కుండలో పెరుగు తింటే మంచిది

Pot curd: మట్టి కుండలో పెరుగు తింటే మంచిది

మట్టికుండలో తోడుపెట్టిన పెరుగు తింటే లాభాలు ఎన్నో. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదట. అందుకే మన అమ్మమ్మలు, నానమ్మలు మట్టి కుండల్లో పెరుగు తోడుబెట్టేవారు. ఈ పెరుగులో ఎన్నో పోషకపదార్థాలు ఉంటాయి. కుండలో తోడుబెట్టిన పెరుగు రుచి ఎంతో బాగుంటుంది కూడా. మట్టి కుండలో తోడెట్టిన పెరుగు తింటే శరీరానికి చాలా మంచిదని శాస్త్రవేత్తలు సైతం చెప్తున్నారు.

- Advertisement -

మట్టి కుండల్లో పెరుగు చిక్కగా తోడుకుంటుంది. పెరుగు మీద మీగడ కూడా బాగా పేరుకుంటుంది. కుండలో తోడెట్టిన పెరుగు గడ్డగా తోడుకోవడానికి కారణం మట్టి పాత్రలు నీటిని సులభంగా పీల్చుకోవడమే. పాలు తోడుకోవడానికి తగిన విధంగా మట్టి కుండల ఉష్ణోగ్రత ఉంటుంది. మట్టికుండల ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు ఉండవు. ఉష్ణోగ్రతలో కొద్ది మార్పు తలెత్తినా పెరుగు నీళ్లల్లా తోడుకుంటుంది. రుచి కూడా బాగుండదు. అందుకే ఈ విషయంలో మట్టికుండ మంచి ఇన్సులేటర్ గా పనిచేస్తుందంటారు శాస్త్రవేత్తలు. మట్టికుండలో పాలు గడ్డ పెరుగులా తోడుకోవడానికి కారణం అది తగినంత మేరే ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. మట్టి కుండలో తోడెట్టిన పెరుగులో ఆరోగ్యాన్నందించే మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్మరస్ లాంటి ఆరోగ్యకరమైన ఖనిజాలతో పాటు బోలెడు సూక్ష్మ పోషకాలు కూడా ఆ పెరుగులో ఉంటాయి. స్టీలు, ప్లాస్టిక్ గిన్నెల్లో తోడుబెట్టిన పెరుగు కన్నా మట్టి కుండలోని పెరుగు వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుందిట. పైగా స్టీలు, ప్లాస్టిక్ పాత్రల్లో తోడెట్టిన పెరుగులో కన్నా మట్టి కుండలోని పెరుగులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయిట.

ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మట్టి కుండ వాసన చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే ఆ పెరుగు రుచి సైతం ప్రత్యేకంగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే కుండ పెరుగు సువాసన మాటలలో చెప్పలేం. వేసవిలో కుండలో పెరుగు ఐదారు గంటల్లో తోడుకుంటే, చలికాలంలో ఎనిమిది నుంచి పన్నెండుగంటల లోపులో తోడుకుంటుంది. పెరుగు పుల్లగా అవకుండా ఉండాలంటే తోడుకున్న పెరుగును వేంటనే ఫ్రిజ్ లో పెట్టాలి. మట్టి కుండలో వేడి చేసిన పాలతో కాఫీ, టీలు చేసుకుని తాగితే కూడా ఎంతో బాగుంటాయి.

పెరుగు, పాల ఉత్పత్తులు ఆల్కలైన్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. కానీ పెరుగును మట్టి కుండలో తోడు పెట్టడం వల్ల ఆ ఎసిడిటీ గుణం బ్యాలెన్స్ అవుతుందంటారు శాస్త్రవేత్తలు. ఫలితంగా పెరుగు గట్టిగా తోడుకోవడమే కాకుండా, తీయగా ఉంటుంది. పులుపెక్కదుట. మరి మీరూ మట్టికుండలో పెరుగును తోడెట్టే పనిలో ఉంటారా…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News