పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని ప్రధమ వార్షికోత్సవ ”ఆరుద్రోత్సవం” కార్యక్రమం మేళతాళాలు, అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య మహా వైభవోపేతంగా జరిగింది.
నిన్న రాత్రి 9 గంటల వరకు ఏకాదశ రుద్రాభిషేకం ఆవు పాలు 108 లీటర్ల తో అభిషేకం, గర్భాలయ దీపోత్సవం, పుష్పాలంకరణ, విశేష నీరాజనములు, మంత్రపుష్పము, అన్న ప్రసాద వితరణ, వైభవంగా ఈ సందర్భంగా ఆలయాన్ని పూలతో అలంకరించారు.
ఆరుద్రోత్సవం కార్యక్రమం భక్తులు పాల్గొని కనులారా తిలకించి తరించారు. శ్రీరామదాసు భజన మండలి ఆధ్వర్యంలో భజన బృందాలు నిర్వహించిన భజనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాగం లక్ష్మీ ప్రసన్న, ఆలయ ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న శర్మ, సూపర్ డెంట్ వెంకటయ్య ఉప ప్రధాన అర్చకులు దేవగిరి రమేష్ శర్మ, అర్చకులు మత్తగజం నాగరాజు, దేవగిరి అనిల్, సునిల్, మరియు అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.