Saturday, November 23, 2024
HomeతెలంగాణGarla: భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలి

Garla: భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలి

సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న భూనిర్వాసిత రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గార్ల మండల కేంద్రంలోని స్థానిక తహశీల్దారు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి బుధవారం మండల కేంద్రానికి వచ్చిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కు సిపిఎం అధ్వర్యంలో వినతిపత్రం అందించారు.

- Advertisement -

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలోని పుల్లూరు, బుద్దారం రెవెన్యూ పరిధిలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించడం లో గత మూడున్నర సంవత్సరాల నుండి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఎన్నో సార్లు జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారుల కు సమస్యను విన్నవించిన సన్న, చిన్న కారు రైతులకు అన్యాయం చేస్తున్నారని అందోళన వ్యక్తం చేశారు.స్థానిక ముప్పై పడకల ఆసుపత్రిలో రోగులకు సరిపడా వైద్యులు, సిబ్బంది లేక పోవడం వలన రోగులకు ప్రభుత్వ వైద్యం అందడం లేదని ఎన్నోసార్లు అందోళన లు, జిల్లా ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందించిన పట్టించుకునే నాథుడే లేడని వాపోయారు. తక్షణమే హాస్పిటల్ లో పూర్తి స్దాయి వైద్యులను నియమించాలని, సీతంపేట సమీపంలోని పెద్ద చెరువులో ఆక్రమణకు గురౌతున్న భూములను కాపాడాలని, ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని,చెరువు చుట్టూ ట్రెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ లతో ఎమ్మెల్యే కనకయ్య అందించారు.

వినతిపత్రం అందజేసిన వారిలో నాయకులు, భూ నిర్వాసితులు భాగం లోకేశ్వరావు,జి.మోహన్, అంబటి వీరాస్వామి,జి.శ్రీను, జి.వీరభద్రం,దస్రు,రామకృష్ణ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News