Saturday, November 23, 2024
HomeతెలంగాణChegunta: టీచర్ల ట్రాన్స్ఫర్, ప్రమోషన్స్ లో సమస్యలు తీర్చండి

Chegunta: టీచర్ల ట్రాన్స్ఫర్, ప్రమోషన్స్ లో సమస్యలు తీర్చండి

ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులలో ఏర్పడిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని, ఉపాధ్యాయులు బదిలీలు పదోన్నతులలో న్యాయం చేయాలన్నారు.

- Advertisement -

ఈ క్రింది సమస్యలను పరిష్కరించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించవలసిందిగా ఆయనను కోరారు.
ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టులు 4429 ప్రస్తుతం మంజూరైనవి కాగా గత ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన హామీ ద్వారా దాదాపు మరో 5571 పోస్టులను మంజూరు చేసి పదివేలు పిఎస్ హెచ్ఎం పోస్టల్ భర్తీ చేశామని చెప్పడం జరిగింది కానీ ఇంకా 55 71 పోస్టులను మంజూరు చేయవలసి ఉంది కావున వాటిని మంజూరు చేసి ప్రస్తుతం జరుగుతున్న పదోన్నతుల ప్రక్రియ వల్ల తీవ్రంగా నష్టపోతున్న బీఈడీ చేసి ఎస్జిటిలుగా కొనసాగుతున్న టీచర్లకు ఈ షెడ్యూల్లోనే పిఎస్ హెచ్ఎం పోస్టులను ఇచ్చి న్యాయం చేయాలి.
ప్రిఫరెన్షియల్ కేటగిరి వారికి ఈ బదిలీ ప్రక్రియ అయ్యేనాటికి అర్హత ఉన్నవారికి అవకాశం కల్పించాలి స్పోర్ట్స్ వారికి కూడా అవకాశం కల్పించాలన్నారు. గతంలో బదిలీలకు దరఖాస్తు చేసుకొని వారు ఇప్పటి కట్ ఆఫ్ తేదీ ఒకటి ఆరు 2024 పెట్టడం వల్ల 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు ఉన్నారు అలాంటివారికి ప్రస్తుతము బదిలీలలో అవకాశం కల్పించాలన్నారు.

కంటోన్మెంట్ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రమోషన్ బదిలీలలో అవకాశం కల్పించాలి
2015 తర్వాత ప్రాథమికోన్నత పాఠశాలల నుండి ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ అయిన పాఠశాలల్లో సరిపడినంత సబ్జెక్టు టీచర్స్ లేక విద్యార్థులకు నష్టం జరుగుతున్నదన్నారు. ప్రస్తుత పదోన్నతుల షెడ్యూల్లో భాగంగా ఆయా పాఠశాలలో కూడా పోస్టులు సర్దుబాటు చేయుటకు అవకాశాలున్నాయని,
ఇటీవల అప్గ్రేడ్ అయిన భాషా పండితుల పోస్టులు విద్యార్థులు తక్కువ ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలకు కూడా కేటాయించారు వాటిని సమీపంలోని హై స్కూల్ కు మార్చడం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో జీరో ఎన్రోల్మెంట్ కారణంగా ఉన్నత పాఠశాలలు మూత పడినవి ఆయా పాఠశాలల పోస్టులను ఇతర ఉన్నత పాఠశాలలో సర్దుబాటు చేయాలన్నారు.
ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుని పదోన్నతికి ఇంటర్మీడియట్ మరియు టిటిసి ఆర్ డి ఈ డి కనీస విద్యార్హత కలిగిన ఎస్జిటి టీచర్లను అర్హులుగా నిర్ణయించారు 1998లో పిఎస్ ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం పోస్టులు మంజూరైన వాటి నుండి చివరి సారి పదోన్నతులు ఇచ్చిన 2015 వరకు అదే పద్ధతిలో పదోన్నతులు ఇచ్చారు. 2009లో విడుదల చేసిన తాత్కాలిక సర్వీస్ నిబంధనలో సైతం పిఎస్ హెచ్ఎం పదోన్నతికి కనీస విద్యారత ఇంటర్ ప్లస్ డీఎడ్ అని పేర్కొన్నారు అయితే ఇంటర్ డీఈడీతో పాటు డిగ్రీ ప్లస్ బిఈడి ఆపై అర్హతలు కలిగి ఉన్న ఎస్జిటి ఉపాధ్యాయులందరినీ పదోన్నతులకు పరిగణించారు.
పాఠశాలలో వెంటనే స్కావెంజర్లను నియమించాలని, గతంలో ప్రభుత్వ పాఠశాలలో కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ ద్వారా స్కావెంజర్స్ ను నియమించగా కరోనా సమయంలో నాటి రాష్ట్ర ప్రభుత్వం వారిని తొలగించడం జరిగిందన్నారు. కానీ నేటి వరకు కూడా మళ్లీ తిరిగి నియమించలేదని, వారి బాధ్యతలను గ్రామపంచాయతీ వర్కర్స్ కు అప్పగించినప్పటికీ వారు ఏనాడు సరిగా పాఠశాలలను శుభ్రం చేయడానికి రావడం లేదన్నారు.

మన ఊరు మనబడి పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి మరుగుదొడ్ల నిర్మాణం చేసి వాటిని శుభ్రం చేసే వ్యవస్థను మరవడం బాధాకరమని, నేడు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు నిర్వహించాల్సి రావడం శోచనీయం రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయులతో ప్రస్తుత ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాటు చేసి, ప్రతి పాఠశాలకు స్కావెంజర్ను, విద్యుత్ సౌకర్యం కల్పిస్తానని చెప్పారని గుర్తుచేశారు. విద్యారంగం ఉపాధ్యాయుల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్న సీఎం అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో కోట్లాది రూపాయల వెచ్చించి పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నారన్నారు. ఇది హర్షణీయమే కానీ అన్ని వసతులు కల్పిస్తున్నప్పటికీ పాఠశాలలో వుడ్చే పని మరుగుదొడ్లు శుభ్రం చేసే స్కావెంజర్ లేకపోవడం చాలా బాధాకరం విద్యార్థులు తల్లిదండ్రుల కూడా మరుగుదొడ్లు శుభ్రం చేసే వ్యవస్థ లేనందున వారి పిల్లలకు అంటురోగాలు సంక్రమిస్తాయని ప్రభుత్వ పాఠశాలలకు పంపమని అంటున్నారన్నారు. చిన్నారి విద్యార్థుల శ్రేయస్సును కాంక్షించి వెంటనే ప్రతి పాఠశాలలో ఒక స్కావెంజర్ను నియమించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News