Saturday, September 28, 2024
Homeటెక్ ప్లస్Cellbay: షియోమి 14సీఐవీఐ లాంచ్ చేసిన సెల్ బే

Cellbay: షియోమి 14సీఐవీఐ లాంచ్ చేసిన సెల్ బే

సినిమాటిక్ విజన్ ఫీచర్ తో..

తెలంగాణలో అత్యంత వేగవంతంగా విస్తరిస్తున్న సంస్థ సెల్ బే తమ గచ్చిబౌలి షో రూమ్ లో షియోమి వారి సరికొత్త 5జీ హ్యాండ్సెట్ షియోమి 14 సీఐవీఐ టాలీవుడ్ యాంకర్ వర్షిణి చేతుల మీదుగా  లాంచ్ చేసారు. ఈ సందర్బంగా నటి వర్షిణి మాట్లాడుతూ..తెలంగాణలో అత్యంత నమకమైన సంస్థ సెల్ బేవారి షోరూమ్ లో షియోమి 14సీఐవీఐ లాంచ్ చెయ్యడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఉత్తమమైన ప్రాడక్ట్స్-సర్వీసులు అందిస్తున్న సెల్ బే మేనేజ్మెంట్ కు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.

- Advertisement -

ఈ సందర్బంగా సెల్ బే ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ సోమా నాగరాజు మాట్లాడుతూ, తమ సంస్థ సెల్ బే ఎల్లప్పుడూ తమ కస్టమర్స్ కు సరికొత్త ప్రొడక్ట్స్ అందిస్తుందని అందులో భాగంగా ఈరోజు 14సీఐవీఐ   లాంచ్ చేశామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కునాల్ అగర్వాల్ (సీనియర్ డైరెక్టర్, డిప్యుటీ హెడ్ ఆఫ్ సేల్స్ షియోమీ ఇండియా), మల్లికార్జున రావు (డైరెక్టర్ ఛానెల్ సేల్స్, షియోమి ఇండియా), సాజు రథ్నం (హెడ్ ఆర్గనైజ్డ్ ట్రేడ్ ఛానెల్, షియోమి ఇండియా, సయ్యద్ అన్వర్, జోనల్ హెడ్ (ఏపీ అండ్ టీఎస్) షియోమి ఇండియాకు కృతజ్ఞతలు తెలిపారు.

సుహాస్ నల్లచెరు, డైరెక్టర్ స్ట్రాటెజీ అండ్ ప్లానింగ్, సెల్ బే మాట్లాడుతూ, షియోమి 14సీఐవీఐ సినిమాటిక్ విజన్ ఫీచర్ కలిగి ఉంది అన్నారు. ఈ ఫోన్ కి ముందు రెండు 32ఎంపీ + 32ఎంపీ కెమరాలు ఉంటాయన్నారు. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 ఎస్ జెన్ 5 జీ ప్రాసెసర్, 4700ఎంఏహెచ్ బాటరీ కలిగి , కేవలం Rs 39999/- ప్రారంభ ధర కలిగి ఉంటుంది అని చెప్పారు. ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయని చెప్పారు.

సెల్ బే మార్కెటింగ్ డైరెక్టర్ సుదీప్ నల్లచెరు మాట్లాడుతూ ..నిరంతరం మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా తమ మార్కెటింగ్ స్ట్రాటజీ లను మలుచుకుంటూ వారికీ సరికొత్త షాపింగ్ అనుభూతిని అందిస్తున్నామన్నారు. షియోమి 14సీఐవీఐ హ్యాండ్సెట్ తమ అన్ని సెల్ బే స్టోర్ లలో ఈరోజు నుండి లభిస్తుందని, ఈ సరికోత ఫోన్ లైకా మెయిన్ కెమరా, లైకా 50ఎంఎం టెలిఫోటో కెమరా, క్వాడ్ కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లే ఉన్నాయని చెప్పారు. తమ వినియోగదారులందరు దగ్గర్లోని సెల్ బే స్టోర్ కు విచ్చేసి ఈ హ్యాండ్సెట్ ను కొనుక్కోవాలని మరియు అద్బుత మైన ఆఫర్లు సొంతం చేస్కోవాలి అని కోరారు.

ఈ కార్యక్రమంలో సెల్ బే సిబ్బంది పాల్గొని సందడి చేసారు. ఈ లాంచ్ ను విజయవంతం చేసినందుకు మేనేజింగ్ డైరెక్టర్ సోమా నాగరాజు మాట్లాడుతూ, తమ కస్టమర్ లకు, మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News