Sunday, September 29, 2024
HomeతెలంగాణKarimnagar: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దాం

Karimnagar: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దాం

రామడుగు ఎంపీపీ జవ్వాజి హరీశ్

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలని
రామడుగు ఎంపీపీ జవ్వాజి హరీశ్ అన్నారు. రామడుగు మండలం గుండి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో బడిపాట ముగింపు సందర్భంగా గురువారం స్వశక్తి మహిళా గ్రూప్ సభ్యులతో గుండి జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు బలవంతయ్య ఆధ్వర్యంలో గురువారం సమావేశం ఏర్పాటు చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని అన్నారు. మండల విద్యాధికారి వేణుకుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు మనుగడ సాగించాలంటే తల్లులుగా మీరు మంచి ఆలోచనతో నిర్ణయం తీసుకొని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన, అనుభవజ్ఞులైనా ఉపాధ్యాయులు ఉన్నారని, పిల్లల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతారనీ అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు భగవంతయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాల గురించి తెలియజేస్తూ ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చించడమేకాక అప్పుడప్పుడు పాఠశాలకు వచ్చి తమ పిల్లల ప్రగతిని సమీక్షించాలని, ప్రశ్నించే తత్వాన్ని అలవరచు కోవాలని కోరారు.

ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా లక్ష రూపాయలు వెచ్చిస్తూ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించి పేదింటి పిల్లలకు కూడా కార్పోరేట్ స్థాయి విద్యను అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.

ఈ సందర్భంగా ఆశా అంగన్ వాడి వర్కర్లు ఆధ్వర్యంలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ నిమిత్తం అల్చెండజోల్ మాత్రలను పంపిణి చేశారు. 10 వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థినులకు సన్మానం చేశారు. ఎంపీపీ చేతుల మీదుగా పాఠశాల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కుల పంపిణి చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ జవ్వాజి హరీష్,ఎం.ఇ.ఓ వేణు కుమార్, అమ్మ ఆదర్శ పాఠశాల ఛైర్మన్ కొమురవ్వ, సి. ఏలు శ్యామల, వసంత, మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పాఠశాల ఉపాధ్యాయులు కే. దయాకర్, రమాదేవి, ఎం.డి. ఉమర్ అల్, కే. మంజుల, బి. జయ, ఎస్. వినయ్ కుమార్, కే.కవిత, రమేశ్, డి. పుటిప్, ఉత్కం శ్రీనివాస్, మానుపటి వెంకటేష్ రాజులతో పాటుగా దాదాపు 150 మంది మహిళా స్వశక్తి గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News