Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Modi Mania: మోడీని ఆకాశానికి ఎత్తుతున్న హీరో యశ్..ప్రధాని సాఫ్ట్ పవర్ అన్న కన్నడ ఇండస్ట్రీ

Modi Mania: మోడీని ఆకాశానికి ఎత్తుతున్న హీరో యశ్..ప్రధాని సాఫ్ట్ పవర్ అన్న కన్నడ ఇండస్ట్రీ

ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నా..ఆ రాష్ట్రంలో ప్రధాని మోడీ ఆ రాష్ట్రానికి చెందిన ప్రముఖులతో డిన్నర్ లు, చాయ్ పే చర్చలు చేపడుతారు. పెద్ద ఎత్తున జరిగే ఈ కార్యక్రమాల్లో సెలబ్రిటీలు, పలు రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్ కు పెద్ద పీట వేయటం ఆనవాయితీగా వస్తోంది. ప్రధానితో కలిసి ఇంత క్వాలిటీ టైం గడుపుతూ, సెల్ఫీలు తీసుకోవటం అంటే గొప్ప విషయమే. ప్రస్తుతం కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో మోడీ మళ్లీ ఇదే ఫార్ములాను రిపీట్ చేస్తున్నారు.

- Advertisement -

కర్నాటకకు చెందిన పలు రంగాల ప్రముఖులతో మోడీ భేటీ వేశారు. ఈ భేటీపై ప్రముఖులు తమ అభిప్రాయాలను, అనుభవాలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫోటోలు, వీడియోలు, టెక్ట్సుల రూపంలో పోస్ట్ చేస్తున్నారు. కేజీఎఫ్ సూపర్ హిట్ తో స్టార్ అయిన హీరో యశ్ కూడా మోడీని కలిసిన వారిలో ఉన్నారు. మోడీ బిహేవియర్ తో తాను చాలా ఇంప్రెస్ అయినట్టు, ఆయన ఓ సాఫ్ట్ పవర్ అంటూ యశ్ మోడీని ఆకాశానికి ఎత్తేశారు. అంతేకాదు ఇండస్ట్రీ డిమాండ్స్ ఏంటో అడిగి, సావధానంగా విన్న ప్రధానికి తమ పరిశ్రమపై మంచి పట్టుందని కితాబిచ్చారు. రిషబ్ షెట్టీతో మాట్లాడిన మోడీ కాంతారా సినిమాను అభినందిస్తూ, ఇండస్ట్రీ అవసరాలు, ఎక్స్ పెక్టేషన్స్ ఏమిటని అడిగినట్టు రిషబ్ వెల్లడించారు. ఎయిరో షో ప్రారంభోత్సవానికి వచ్చిన మోడీ ఇలా సెలబ్రిటీలతో భేటీ వేశారు.

అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్, వెంకటేశ్ ప్రసాద్, అయ్యో శ్రద్ధ, యశ్, రిషబ్ షెట్టీ, పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్విని పునీత్ రాజ్ కుమార్ వంటివారంతా మోడీతో పిచ్చాపాటిగా గడపటం, తాజాగా ఆ వివరాలు ఒక్కొక్కటే బయటికి వస్తుండటం ఆసక్తిగొలుపుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News