ఎయిర్ బస్ కు అతిపెద్ద ఆర్డర్ రావటం కొత్త రికార్డుగా మారింది. ఎయిర్ ఇండియాను సొంతం చేసుకున్న టాటా ఎయిర్ లైన్స్ ఎయిర్ బస్ కు ఏకంగా 250 విమానాల ఆర్డర్ పెట్టింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏవియేషన్ డీల్ గా చరిత్ర సృష్టించనుంది. ఈ డీల్ లో భాగంగా టాటాలు 40 ఏ350 వైడ్ బాడీ లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్ బస్సులు 210 నారో బాడీ విమానాలు ఆర్డర్ చేసింది.
- Advertisement -
ఈమేరకు ఎయిర్ బస్ చీఫ్ ఎగ్జిక్యుటివ్ గులామి ఫౌరీ ప్రధాని నరేంద్ర మోడీ, రతన్ టాటా, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యువల్ మాక్రన్ వీడియో కాల్ లో ఉన్న భేటీలో వెల్లడించారు. ఇండియా-ఫ్రాన్స్ ద్వైపాక్షిక సంబంధాల్లో ఇదో మైలురాయంటూ మాక్రన్ పేర్కొన్నారు.