పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గర బీఆర్ఎస్ నేతలు హై డ్రామా సృష్టించేందుకు ప్రయత్నించారు. పోచారం, ఆయన కుమారుడు ఇద్దరూ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. దీంతో భగ్గుమన్న బీఆర్ఎస్ ఏకంగా పోచారం ఇంటివద్దే నిరసనలకు దిగింది. ఈమేరకు బాల్క సుమన్, బాలరాజ్ యాదవ్, రాకెష్ కుమార్, గెల్లు శ్రీనివాస యాదవ్ తదితరులు పోచారం ఇంటివద్ద నిరసనకు దిగగా రంగంలోకి దిగిన పోలీసులు వీరందరినీ అరెస్ట్ చేశారు.
కాంగ్రెస్ ప్రలోభాలకు నిరసనగా తాము పోచారం ఇంటికి వెళ్లి, నిరసనకు దిగినట్టు గులాబీ నేతలు వెల్లడించారు. దీంతో బిఆర్ఎస్ నేతలను అడ్డుకునేందుకు పోలీసులు బరిలోకి దిగాల్సివచ్చింది. అరెస్టు అయిన గులాబీ నేతలంతా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.