Sunday, November 24, 2024
HomeదైవంTanduru: భూకైలాస్ ఆలయ బ్రహ్మోత్సవాలు

Tanduru: భూకైలాస్ ఆలయ బ్రహ్మోత్సవాలు

వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని అంతరం తండాలో వెలిసిన భూకైలాస్ దేవస్థానంలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిపేందుకు మందిరం ముస్తాబైంది. తాండూరు పట్టణ శివారులో ఉన్న అంతారం భూకైలాస్ దేవస్థానం ఆలయాలలో మహాశివరాత్రి వేడుకలను అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.

- Advertisement -

జ్యోతిర్లింగాలు
ఇక్కడి భూకైలాస్ దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహిస్తారు. భక్తులు కర్ణాటక, మహారాష్ట్రతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ తదితర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో తరలిరానున్నారు. తాండూరు నుంచి సుమారు 2 – 3 కిలోమీటర్ల దూరంలో అంతారం తండా ఉన్నది. శివస్వాములు కొంత మంది ఇక్కడే మాలను తీస్తారు. విశాలమైన ప్రాంగణంలో పచ్చని చెట్ల మధ్య కనిపిస్తుంది ఈ గుడి. భూకైలాస్ దేవస్థాన ప్రాంగణంలోకి అడుగుపెడితే మొదట 65 అడుగుల భారీ శివుడి విగ్రహం ఉంటుంది. అక్కడినుంచి కాస్త ముందుకెళ్తే నీటి మార్గం ద్వారా లోపలికి వెళ్లేలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఆ నీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటాయి. ప్రాంగణంలో వీరభద్రుడు, ఆంజనేయుడు, వినాయకుడు, తుల్జాభవానీ, కాళికాదేవి వంటి భారీ విగ్రహాలనూ దర్శించుకోవచ్చు.

శక్తి పీఠాలు కూడా

భూకైలాస్ లో ఈ ఏడాది కొత్తగా పలు దేవతా మూర్తుల ప్రతిష్టాపనతో పాటు శక్తి పీఠాలు, నవగ్రహ విగ్రహాల ప్రతిష్టాపన చేస్తున్నారు. మహాశివరాత్రి రోజు శక్తి పీఠాలు, ఆత్మలింగ ప్రతిష్టాపన, శని దేవుని ప్రతిష్టాపన, నవగ్రహాల ప్రతిష్టాపన నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు నిత్యాన్నదాన కార్య క్రమం ఏర్పాటు కూడా చేస్తున్నట్లు తెలిపారు.



సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News