Saturday, September 28, 2024
HomeNewsGarla: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ధనియాకుల రామారావు

Garla: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ధనియాకుల రామారావు

రైతు రుణాలు ఒకేసారి మాఫీ చేయాలని నిర్ణయం తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి ఏక కాలంలో రైతులకు 2 లక్షల రుణ మాఫీ, ప్రకటించి రైతు పక్షపాతిగా నిలుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని మండల కాంగ్రెస్ అద్యక్షుడు దనియాకుల రామారావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు గుండా వెంకట్ రెడ్డి అన్నారు. గార్ల మండల కేంద్రంలోని స్థానిక వర్తక సంఘ భవనంలో కాంగ్రెస్ పార్టీ మండల అద్యక్షుడు ధనియాకుల రామారావు అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ధనియాకుల రామారావు గుండా వెంకట్ రెడ్డిలు మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసి రైతు ప్రభుత్వంగా నిరూపించామన్నారు. ఆరు గ్యారెంటీల పథకాలను అమలు చేస్తూ ప్రజల పార్టీ గా కాంగ్రెస్ ముందుకు సాగుతోందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు చేసిందే మీలేదని విమర్శించారు. ఆరు గ్యారెంటీ లలో ఇప్పటికే 4 నాలుగు గ్యారెంటీ లు అమలు చేయగా ఆగస్టు 15 లోపు 47 లక్షల మంది రైతులకు రూ.31 వేల కోట్లు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేయనుందని, తెలిపారు. త్వరలో అర్హులైన మహిళల ఖాతాల్లో 25 వందలు జమ చేయనుందని, ప్రతి నీయోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందని, మండల కాంగ్రెస్ నాయకులమంతా ఎమ్మెల్యే, కొరo కనకయ్య మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లను కలిసి గార్ల మండలానికి మొదటి విడతలో 15 వందల ఇండ్లు మంజూరు చేయాలనీ కోరుతామని అన్నారు. ఎమ్మెల్యే కోరo కనకయ్య , మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల ఆధ్వర్యంలో మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ది పరిచేలా ఎక్కువ నిధులు మంజూరు తెప్పించు కోవటానికి మండల కాంగ్రెస్ నాయకుల మంతా సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సి సెల్ కన్వీనర్ బాపన పల్లి సుందర్, జిల్లా కాంగ్రెస్ నాయకులూ గంగావత్ రామ్ సింగ్, కాంగ్రేస్ పార్టీ సోషల్ మీడియా మండల కన్వీనర్ గుడిచుట్టూ నవీన్ , మీరా పఠాన్,ఎన్ ఎస్ యు ఐ నాయకులు ఎస్ కె. యాకూబ్ పాషా, కోలా కుమార్ గౌడ్ , వశ్య ,సుమన్ ,చింతల కొండలరావు, రామకృష్ణ ,ఎర్ర బదృ, పడిత్య , హనుమంతు , రావి, హరి ,పాలేరు వెంకటేశ్వర్లు , తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News