గార్ల మండల కేంద్రంలోని స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్పీ రాకతో ఎస్ఐ జీనత్ కుమార్, సీఐ రవికుమార్ లు సిబ్బంది ఘన స్వాగతం పలికి గౌరవ వందనం చేశారు.
పోలీస్ స్టేషన్ పరిధిలోని పరిసరాలను స్టేషన్ ఆవరణాన్ని ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. తొలుత రిసెప్షన్‌ను సందర్శించి పలు రికార్డుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు.
విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాలని సూచించారు ప్రజలతో ఫ్రెండ్లీ పోలీస్ విధానం అవలంభిస్తూ, సిబ్బంది అందరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి, ప్రజల మన్నలను పొందాలని సూచించారు. ఆయన వెంట డీఎస్పీ తిరుపతి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.