Saturday, April 12, 2025
Homeచిత్ర ప్రభDouble Ismart on July 1st: జూలై 1న డబుల్ ఇస్మార్ట్

Double Ismart on July 1st: జూలై 1న డబుల్ ఇస్మార్ట్

మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రామ్..

ఉస్తాద్ రామ్ పోతినేని, సంజయ్ దత్, పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్, పూరి కనెక్ట్స్ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘డబుల్ ఇస్మార్ట్’ ఫస్ట్ సింగిల్ స్టెప్పా మార్ జూలై 1న రిలీజ్

- Advertisement -

ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియన్ ఫిల్మ్ ‘డబుల్ ఇస్మార్ట్‌’తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ సగర్వంగా నిర్మించారు. ఈ మూవీ ఆగస్ట్ 15, 2024న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.

మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్‌లను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ పార్ట్ కి చార్ట్-బస్టర్ ఆల్బమ్‌, అద్భుతమైన బీజీఎం అందించిన మ్యాజికల్ కంపోజర్ మణిశర్మ ఇప్పుడు మళ్లీ అదరగొట్టబోతున్నారు. ఫస్ట్ సింగిల్ ‘స్టెప్పా మార్’ ని జూలై 1న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

శివుడి విగ్రహం ముందు రామ్ పోతినేని కంప్లీట్ స్టైలిష్ వైబ్‌లో డ్యాన్స్ చేస్తున్నట్లు ప్రజెంట్ చేసిన అద్భుతమైన పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఈ సాంగ్ ఎలక్ట్రిఫైయింగ్ ట్యూన్ గా మాస్ ప్రేక్షకులకు ఇన్స్టంట్ ఎడిక్షన్ కానుంది. రామ్ డ్యాన్స్ మూవ్స్ మెయిన్ హైలైట్‌గా ఉంటాయి. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా, భాస్కర భట్ల లిరిక్స్, అనురాగ్ కులకర్ణి వోకల్స్ ని అందించారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీలో సంజయ్ దత్ మెయిన్ విలన్, కావ్య థాపర్ ఫిమేల్ లీడ్ గా నటించారు.

డబుల్ ఇస్మార్ట్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News