శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. నాల్గవ రోజు భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జునస్వామి వారు మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరిమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో మయూర వాహనంలో ఉంచి వాహన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవారి ఉత్సవ మూర్తులతో విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నుల పండువగా గ్రామోత్సవానికి తరలివెళ్ళారు. రాజగోపురం గుండా మయూర వాహనాధీశులైన శ్రీస్వామి అమ్మవార్లను ఊరేగింపు బాజా బజంత్రీల నడుమ సాగింది. శ్రీశైలం పురవీధుల్లో విహరించేందుకు మయూర వాహనంపై స్వామి అమ్మవార్లు విహరిస్తుండగా భక్తులు అధికసంఖ్యలో పాల్గొని కనులారా దర్శించుకుని, కర్పూర నీరాజనాలర్పించారు . ఉత్సవమూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Srisailam: మయూర వాహనంపై విహరించిన మల్లికార్జునుడు
- Advertisement -
సంబంధిత వార్తలు | RELATED ARTICLES