గీతం ఫ్యాకల్టీ డాక్టర్ సయంతన్ మండల్, డాక్టర్ జోంధాలే రాహుల్ హిరామన్ లు ఫ్రాన్స్ యూనివర్సిటీలో ప్రసంగించనున్నారు. ఫ్రాన్స్ లోని నాటింగ్హామ్ ట్రెంట్ యూనివర్సిటీ పోస్ట్కలోనియల్ అండ్ గ్లోబల్ స్టడీస్ రీసెర్చ్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించే వర్క్ షాప్ లో ప్రసంగించేందుకు వీరిద్దరు ఆహ్వానం అందుకున్నట్టు గీతం విద్యాసంస్థలు వెల్లడించాయి.
ఆ తరువాత బ్రిటన్ లోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ లో జరిగే గ్లోబల్ బుక్ కలర్స్-మెటీరియలిటీస్, కొలాబరేషన్, యాక్సెస్ అనే పేరుతో సొసైటీ ఫర్ ది హిస్టరీ ఆఫ్ ఆథర్షిప్, రీడింగ్ అండ్ పబ్లిషింగ్ సదస్సులో సయంతన్, రాహుల్ ప్రసంగించనున్నారు, గతంలో, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పుస్తకాలు-గ్రంథాల రచన-ముద్రణ-పంపిణీపై ఈ సమావేశం దృష్టిసారిస్తోంది.
ఇలా అంతర్జాతీయ వర్క్ షాపులు, సదస్సులకు గీతం అధ్యాపకులు తరచూ వెళ్లటం తమ సంస్థకు గర్వకారణమని యూనివర్సిటీ వెల్లడించింది.