బీర్ పూర్ మండలం లోని వివిధ గ్రామాలలో కోతుల, కుక్కల బెడద ఎక్కువగా ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆహారం కోసం ఇళ్లలో జొరబడి కోతులు నిత్యావసర సరుకులు, ఇంట్లో ఉన్న సామాగ్రిని నానా బీభత్సం చేస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. బీర్ పూర్ గ్రామానికి చెందిన చిర్నేని రఘున అనే మహిళ ఇంటి ముందు పని చేసుకుంటుండగా కోతులు దాడి చేయగా, తలపై తీవ్ర గాయాలయ్యాయి. రఘుణ కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. రఘున ఆవేదనగా మాట్లాడుతూ రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో జొరబడి ఆహార పదార్థాలను ఎత్తుకెళుతున్నాయని వాటిని వెళ్ళగొట్టబోతే మీద పడి కరుస్తున్నాయని అన్నారు. ఇంటి పైకప్పులు ఇంటిపై కప్పే కవర్లను కూడా నాశనం చేస్తున్నాయి అని తెలియజేశారు.
రోజురోజుకు కోతుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న అటు అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు గాని పట్టించుకోవడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు వృద్ధులు చిన్నపిల్లలు ఒంటరిగా వెళ్లాలంటే కోతులు ఎక్కడ మీద పడి కరుస్తాయోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం పూట పిల్లలను పాఠశాలలకు పంపాలంటే తల్లిదండ్రులు వెంట వెళ్లాల్సి వస్తుందని తిరిగి పాఠశాల నుండి తీసుకురావాల్సి వస్తుందని అంటున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి గ్రామాల్లో కోతుల బెడదను తొలగించాలని లేని పక్షంలో రోజురోజుకు పెరుగుతున్న కోతుల సంఖ్యతో జనజీవన స్రవంతి అతలాకుతలం కాక తప్పదని ప్రజలు అంటున్నారు.