Saturday, April 5, 2025
HomeతెలంగాణKavitha: దళిత క్రైస్తవులకు రాజకీయ అవకాశాలు

Kavitha: దళిత క్రైస్తవులకు రాజకీయ అవకాశాలు

రాష్ట్రంలో దళిత క్రైస్తవులకు కేసీఆర్ రాజకీయ అవకాశాలు కల్పిస్తున్నారని, రానున్న రోజుల్లో సమయం సందర్భాన్ని బట్టి మరింత మందికి అవకాశాలు కల్పిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. సీఎం కేసీఆర్ లౌకిక స్వరూపాన్ని కాపాడుతున్నారని, శాంతిసామరస్యాలతోనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని నమ్ముతారని తెలిపారు. కేసీఆర్ జన్మదిన సందర్భంగా సికింద్రాబాద్ వెస్లీ డిగ్రీ కాలేజీలో టీఎస్ ఫుడ్స్ ఛైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో జరిగిన దళిత క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో కవిత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కేరళ, కర్నాటక, తమిళనాడు నుంచి కూడా ఈ కార్యక్రమానికి క్రిస్టియన్ మతపెద్దలు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News