Friday, October 18, 2024
HomeఆటMonsoon regatta: అండర్‌‌-16 విభాగంలో అగ్రస్థానంలో గోవర్ధన్

Monsoon regatta: అండర్‌‌-16 విభాగంలో అగ్రస్థానంలో గోవర్ధన్

సత్తా చాటిన తెలంగాణ సెయిలర్లు

15 వ మాన్‌సూన్‌ రెగట్టా హోరాహోరీగా సాగుతోంది. హుస్సేన్‌ సాగర్‌‌ జలాల్లో జరుగుతున్న పోటీల్లో రెండో రోజు తెలంగాణ సెయిలర్లు సత్తా చాటారు. అండర్‌‌-16 ఆప్టిమిస్ట్ క్లాస్ సబ్‌ జూనియర్ ఫ్లీట్‌ 12 రేసులకు గాను ఐదు రేసులు పూర్తయ్యే సరికి స్థానిక సెయిలర్‌‌ గోవర్ధన్ పల్లార తన మెరుపు వేగంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. రెండో రోజు మూడు రేసుల్లో పోటీ పడ్డ గోవర్ధన్ ఒకదాంట్లో మొదటి స్థానం మరో రెండింటిలో 8, 4వ స్థానాలు సాధించాడు. మొత్తంగా దేశవ్యాప్తంగా 39 మంది సెయిలర్లు బరిలో నిలిచిన ఈ విభాగంలో అతను అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అండర్‌‌18 ఐఎఎల్‌సీఏ 4 సింగిల్‌ స్కల్‌ హ్యాండర్ బాలికల విభాగంలో తెలంగాణకు చెందిన మాన్యా రెడ్డి మూడో స్థానంలో కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News