Friday, October 18, 2024
HomeతెలంగాణGarla: ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు

Garla: ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు

మొక్కులు చెల్లించుకున్న భక్తులు

గార్ల మండల కేంద్రంలోని పలు ఆలయాలలో బుధవారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి ప్రజలు ఆలయాలకు పోటెత్తి పూజలు చేసి పసుపు కుంకుమ కొబ్బరికాయ చీరలు అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకుని దేవతా మూర్తులను దర్శనం చేసుకున్నారు.

- Advertisement -

గార్ల మండల కేంద్రం జెండాబజార్ లోని స్థానిక శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ అర్చకులు అచ్యుత్ ఆచార్య స్వామి దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు అర్చనలు అభిషేకాలు చేశారు. సామూహికంగా 108 పర్యాయములు శ్రీ విష్ణు సహస్రనామా పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రమేష్ బాబు జక్కుల పాండురంగారావు రాంబాబు కుటుంబ రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News