అప్పర్ భద్ర ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని వేదవతి నీటి సాధన సమితి తాలూకా నాయకుడు జి.మహానంది డిమాండ్ చేశారు. స్థానిక బెల్లిగుండు ఆంజనేయస్వామి దేవాలయం ఆవరణంలో వేదావతి నీటి సాధన సమితి ఆధ్వర్యంలో హాలహార్వి సర్పంచ్ మల్లికార్జున అధ్యక్షన నిర్వహించిన సమావేశంలో మహానంది మాట్లాడుతూ .. త్వరలో జరగనున్న కర్ణాటక రాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి పొందాలని లక్ష్యంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అపర భద్ర ప్రాజెక్ట్ ‘అక్రమనీటి ప్రాజెక్టు’ అని ఆయన మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఇటీవల కేంద్ర బడ్జెట్ లో రూ. 5,300 కోట్లు విడుదల చేసిందన్నారు . ప్రాజెక్టు నిర్మాణంతో రాయలసీమ ప్రాంతానికి తీరని నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. ఆలూరు, పత్తికొండ, ఆదోని నిత్యం కరువు కాటకాలతో వలసలతో, ఆత్మహత్యలతో నిలయంగా ఉన్న రాయలసీమలోని ప్రాజెక్టులను నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు కేటాయించడంలో కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం అధికారం కోసం ప్రాంతీయ సమస్యలను సృష్టిస్తుందన్నారు. దీనిపై ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అక్రమ ప్రాజెక్టును నిలుపుదల చేసే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. లేని పక్షంలో ఉద్యమాని తీవ్రతరం చేస్తామన్నారు.
Aluru: అక్రమ ప్రాజెక్టు అప్పర్ భద్రను ఆపండి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES