Friday, October 18, 2024
HomeతెలంగాణGarla: ఘనంగా అమ్మ మాట అంగన్వాడి బాట

Garla: ఘనంగా అమ్మ మాట అంగన్వాడి బాట

గార్ల మండల పరిధిలోని పుల్లూరు గ్రామపంచాయతీ అంగన్వాడి కేంద్రం వద్ద అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని సూపర్వైజర్ గోపమ్మ అంగన్వాడీ టీచర్లు ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలతో కలిసి ప్రారంభించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు సంవత్సరాలు దాటిన పిల్లల పేర్లను ఇంటింటి తిరిగి నమోదు చేసుకుంటామన్నారు. మీ పిల్లలను అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాలని తెలిపారు. అంగన్వాడి కేంద్రంలో నర్సరీ తరగతులు ఇంగ్లీష్ మీడియంలో కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించకుండా అంగన్వాడి కేంద్రాలకు పంపించాలని కోరారు. గర్భిణీలు, బాలింతలు, చంటి పిల్లలకు అంగన్వాడీ కేంద్రం ద్వారా అందించే సేవలు గురించి వివరించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు గర్భిణీలు బాలింతలు చిన్నారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News