స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏకకాలంలో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది అని పిసిసి ప్రధాన కార్యదర్శులు చారకొండ వెంకటేశ్, పున్న కైలాష్ నేత అన్నారు.
అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం వద్ద సీఎం కి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 75 లక్షల రైతుల కుటుంబాల కన్నీళ్లు తుడవడానికి సీఎం రేవంత్ కంకణబద్దులై వున్నారని ఎన్నికల ముందు వరంగల్ రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలుపుకున్న ఘనచరిత్ర సీఎం రేవంత్ రెడ్డిది అని, చరిత్రలో సువర్ణ అధ్యయనం కానున్నదని వారు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కెసిఆర్ రెండుసార్లు సీఎం అయినా కానీ రైతులకు మేలు చేయలేదని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి నాశనం చేశారని రైతులని మోసం చేశారని అలాంటి రైతుల కన్నీళ్లను తుడవటానికి రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారు. అందుకు తెలంగాణ రైతులకు ఉద్యమకారుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.
రాజకీయ లబ్ధి కోసం రైతులని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న హరీష్ రావు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నెలకు రాయాలని వారు డిమాండ్ చేశారు. పది సంవత్సరాలలో బిఆర్ఎస్ ప్రభుత్వం 21 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చుపెట్టిందని కానీ నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 31 వేల రూపాయల కోట్లతో రైతు రుణమాఫీ చేసి ప్రజల మన్నలను పొందారని వారికి ఉద్యమకారులు రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శులు చారకొండ వెంకటేష్, పున్న కైలాశ్ నేత బట్టు జగన్ యాదవ్, బాలకృష్ణ నేత, రాంబాబు నాయుడు, దర్శ సతీష్, కూరాకుల శీను, సాయి ప్రకాష్, పాతపల్లి నరసింహ, బుచ్చిరెడ్డి, శంకర్ నాయక్, రాపోలు వాసు, మల్లేషు, రవికుమార్, మున్నా నాయక్ తదితరులు పాల్గొన్నారు.