Saturday, November 23, 2024
HomeతెలంగాణCM Revanth new road map for government schools development: సర్కారీ బడుల...

CM Revanth new road map for government schools development: సర్కారీ బడుల పటిష్టతకు సరికొత్త విధానం

ప్రభుత్వ పాఠశాలల్లో పటిష్టతకు సరికొత్త విధానంతో ముందుకెళ్లనున్న ప్రభుత్వం.

- Advertisement -

వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖ కారదర్శి బుర్రా వెంకటేశంకు సూచించిన సీఎం.

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ తో సమాంతరంగా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కొనసాగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించిన సీఎం.

ప్లే స్కూల్ తరహాలో 3వ తరగతి వరకు అంగన్ వాడీ కేంద్రాలలోనే విద్యాబోధన చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్న సీఎం.

సొంత గ్రామాల్లోనే విద్యార్థులు చదువుకునేలా వీలు కల్పించాలని సూచన.

అంగన్ వాడీలలో విద్యాబోధనకు అదనంగా ఒక టీచర్ నియమించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించిన సీఎం.

4వతరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్న సీఎం.

గ్రామాల నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కు వెళ్లేందుకు ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించేలా చూడాలని సూచించిన సీఎం.

విద్యా వేత్తల అభిప్రాయాలు తీసుకున్నాక ఒకట్రెండు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టేలా ప్రాణాళికలుండాలన్న సీఎం.

ప్రభుత్వ నిధులతోపాటు సీఎస్ఆర్ ఫండ్స్ తో విద్యార్థులకు అన్ని వసతులు ఉండేలా చర్యలు చేపట్టాలన్న సీఎం.

విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News